
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యులకు, నీలమ్మ వేప చెట్టు పాలక మండలి సభ్యులకు,ఇతర కమిటీ సభ్యులకు సీతంపేట కార్యాలయంలో శుభాకాంక్షలు తెలపిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్.కేజీహెచ్ అభివృద్ధి కమిటీ సభ్యులుగా నియామకమైన డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్ ని, యజ్ఞశ్రీ ని దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సన్మానించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ,కేజీహెచ్ అభివృద్ధికి తమసేవలు ఎంతో ఉపయోగపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో కేజీహెచ్ కీలక పాత్ర పోషిస్తోందని, అభివృద్ధి కమిటీ సభ్యులుగా బాధ్యతలు చేపట్టిన వారు ఆసుపత్రి అభివృద్ధికి విశేషంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. నియామకానికి ఎంపికైన డాక్టర్ మర్రివేముల శ్రీనివాస్, యజ్ఞశ్రీ కి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రత్యేక అభినందనలు తెలియజేసి శాలువాతో సత్కరించారు.