

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)
అభాగ్యులకు ఆసరాగా మన విశాఖ దక్షిణ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ మరియు రాష్ట్ర ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ నిలుస్తున్నారు, గత ప్రభుత్వంలో ఎంతోమంది నిరుపేదలు కార్పొరేట్ వైద్యం చేసుకుంటూ సకాలంలో వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆర్థిక సహాయం అందలేకపోవడం చాలామంది నిరుపేదలు అప్పుల పాలై ఉండేవారు అయితే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు మరియ యువ మంత్రి నారా లోకేష్ నిరుపేదల వైద్య ఖర్చులు నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అందించాలని మంచి ఆశయంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది, తదుపరి ఈ 24 నెల కుటమి పరిపాలనలో విశాఖ దక్షిణ నియోజకవర్గం లో ముఖ్యంగా 39 వ వార్డులో అనేకమంది నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య ఖర్చులు చెక్కుల రూపంలో అందించడం జరిగినది ఇందులో భాగంగా ఈరోజు 39 వ వార్డు చెందిన సుమారు 7 మంది నిరుపేదలకు వారి వైద్య ఖర్చు నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కులు అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో సీతంరాజు సుధాకర్ స్వయంగా తన కార్యాలయంలో స్వయంగా లబ్ధిదారులకు అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు మైలిపిల్లి శ్రీను, క్లస్టర్ ఇంచార్జ్ వాసుపల్లి దానేష్ తదితరులు పాల్గొన్నారు