60 వార్డులో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకలు

విశాఖ పశ్చిమం, (స్వతంత్ర ప్రభ)

విశాఖ పశ్చిమ నియోజకవర్గ 60వ వార్డు శ్రీహరిపురం మెయిన్ రోడ్డు ప్రాంగణంలో స్వర్గీయ నందమూరి తారకరామారావు  103వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు వియ్యపు సన్యాసిరావు హాజరై కేక్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజమే దేవాలయం పేద ప్రజల దేవుళ్ళు అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ ని ప్రారంభించి అతి తక్కువ కాలంలో 9 నెలలు లో స్థాపించి బడుగు బలహీన వర్గాల ఆశీస్సులతో అన్న నందమూరి తారక రామారావు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అన్న ఎన్టీ రామారావు పేదల ఆకలి తీర్చడానికి రెండు రూపాయల కిలో బియ్యం ప్రభుత్వ పథకం ప్రవేశపెట్టారు… ఈ పథకం దేశంలో అనేక రాష్ట్రాల లో అమలు చేశారు.. మహిళల కోసం డ్వాక్రా గ్రూపులు స్రీ శక్తి ఎన్నో ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత ఒక్క ఎన్టీఆర్కే దక్కింది . సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో మజ్జిగ  ఆటోలో వెళుతున్న ప్రజానీకానికి బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు బాటసారులకు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా వేలాది మందికి చలివేంద్రo ఏర్పాటుచేసి మజ్జిగ , స్వీట్స్  సీనియర్ ఎన్టీఆర్ కార్యకర్తలు పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో వీరిని కొండబాబు ,ఉపనాతిహరి,పళ్ళ కనకరాజు ,శేఖర్,రిమ్మనపూడి వెంకటేశ్వరరావు, సిఎం రాము,.కోపనాతి సోమశేఖర్ ,ఆడారి నరసింహమూర్తి,పోతాబుత్తుల కన్నబాబు,కర్రీ రామారావు ,పల్లా గోపాల్, వియ్యపు వినయ్ కుమార్, పల్లా అప్పల నరసయ్య, శిరం రాము, పోలిశెట్టి సుందర్రావు. కోపనాతి హరి. ఆడారి నరసింహమూర్తి. పల్లా శ్రీను,ఎ ఏరుకప్ప, బొయ్య దాపు అప్పలరాజు, కోపనాతి అప్పలరాజు,శేఖర్, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *