గంటా నూకరాజు ఆధ్వర్యంలో కిక్ బాక్సింగ్ సమ్మర్ క్యాంప్

క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుంది….

హోమ్ గార్డ్ జోగ ఉదయ శంకర్ …

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

స్థానిక చెంగల్‌రావు పేటలోని జీవీఎంసీ ప్రీమియర్ హైస్కూల్ ఆవరణలో చిన్న పిల్లల శారీరక దారుఢ్యం, స్వయం రక్షణ నైపుణ్యాలను పెంపొందించే ఉద్దేశ్యంతో ఏర్పాటు చేసిన కిక్ బాక్సింగ్ వేసవి శిక్షణ శిబిరం (సమ్మర్ కోచింగ్ క్యాంప్) శనివారం ఉదయం అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది.
ఈ శిక్షణ శిబిరంలో ప్రతిభావంతుడైన కిక్ బాక్సింగ్ కోచ్ జీ. నూకరాజు ఆధ్వర్యంలో చిన్న పిల్లలకు కిక్ బాక్సింగ్‌లోని ప్రాథమికాంశాలు, మెళకువలను నేర్పిస్తున్నారు. వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటూ పిల్లలు ఎంతో ఆసక్తితో ఈ శిక్షణలో పాల్గొంటున్నారు.ఈ శిబిరంలో కఠినమైన శిక్షణ తీసుకుంటున్న క్రీడాకారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని, వారికి పౌష్టికాహారంగా బాయిల్డ్ ఎగ్స్ (ఉడికించిన గుడ్లు), చిక్కీలు మరియు గుడ్ డే బిస్కెట్ ప్యాకెట్లను వన్ టౌన్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు చెందిన హోమ్ గార్డ్ (ప్లాటూన్ కమాండర్) జోగ ఉదయ శంకర్ . ముఖ్య అతిథిగా విచ్చేసి స్వహస్తాలతో పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ప్లాటూన్ కమాండర్ జోగ ఉదయ శంకర్ మాట్లాడుతూ, సెలవుల్లో పిల్లలు సమయాన్ని వృథా చేయకుండా ఇలాంటి క్రీడల్లో పాల్గొనడం వల్ల శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని కొనియాడారు. విద్యార్థులకు అండగా నిలుస్తూ వారికి బలవర్ధకమైన ఆహారాన్ని అందించడం తమకు ఎంతో తృప్తిని ఇచ్చిందని తెలిపారు.పిల్లల ఉత్సాహాన్ని చూసి, వారికి అండగా నిలిచిన ట్రాఫిక్ పోలీస్ అధికారి ఉదయ శంకర్ కి కిక్ బాక్సింగ్ కోచ్ జీన్ నూకరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. శిక్షణతో పాటు ఇలాంటి ప్రోత్సాహం లభిస్తే పిల్లలు భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా ఎదుగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు మరియు స్థానికులు పాల్గొన్నారు. క్రమశిక్షణతో వరుసలో నిలబడి పౌష్టికాహారాన్ని స్వీకరించిన పిల్లలను, వారికి శిక్షణ ఇస్తున్న కోచ్‌ను, దాతృత్వాన్ని చాటుకున్న పోలీస్ అధికారిని స్థానికులు ప్రత్యేకంగా అభినందించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *