హోమ్‌లోని రోగులకు అల్పాహార వితరణ చేసిన నేతలు
విశాఖ దక్షిణం ( స్వతంత్ర ప్రభ)
గాజువాక బీజేపీ నాయకులు, జిల్లా మీడియా ప్యానలిస్ట్, గాజువాక మండల ఇన్‌ఛార్జ్ గూడూరు శంకర్రావు, అలాగే దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు, విశాఖపట్నం జిల్లా డి.వి.ఎం.సి ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ కమిటీ సభ్యులు మరియు డి.ఎమ్.సి సఫాయి కర్మచారి సభ్యులు చొక్కాకుల రాంబాబుల జన్మదిన వేడుకలు మే 31న ఘనంగా జరిగాయి. ఈ ఇద్దరు నాయకులు తమ పుట్టినరోజును పురస్కరించుకొని ఆడంబరాలకు దూరంగా, సంయుక్తంగా ఒక మంచి సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. విశాఖపట్నం ఏవీఎన్ కాలేజీ వద్ద ఉన్నటువంటి హోమ్‌ను సందర్శించి, అక్కడ ఉన్నటువంటి రోగులకు తమ చేతుల మీదుగా అల్పాహారాన్ని (టిఫిన్) వితరణ చేశారు. మానవత్వంతో ఇద్దరు నాయకులు కలిసి చేసిన ఈ సేవా కార్యక్రమం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా సీనియర్ నాయకులు ఓ. ఆల్బర్ట్, బీజేపీ స్టేట్ ఎస్సీ కార్యవర్గ మాజీ సభ్యులు దశమంతుల స్వామి, జగదీష్, డి. శ్రీనివాసరావు, డెస్సీ తదితర ముఖ్య నాయకులు పాల్గొని, జన్మదినం జరుపుకున్న నాయకులకు శుభాకాంక్షలు తెలియజేశారు.