మహానాడు తీర్మానంపై చంద్రబాబుకు కృతజ్ఞతలు..

గాజువాక, (స్వతంత్ర ప్రభ)
మహానాడు–2026లో ‘స్త్రీ శక్తి’లో భాగంగా తెలుగుదేశం పార్టీలో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ చారిత్రాత్మక తీర్మానం చేయడంపై మహిళా లోకం హర్షం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో, గాజువాక శాసనసభ్యులు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమక్షంలో గాజువాక టీడీపీ కార్యాలయంలో మహిళా కార్యకర్తలు భారీ ఎత్తున సమావేశమయ్యారు. మహిళల రాజకీయ సాధికారతకు ఎంతగానో దోహదపడే ఈ అద్భుత నిర్ణయాన్ని తీసుకున్నందుకు, మహిళలకు పార్టీలో పెద్దపీట వేసినందుకు పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కి, పార్టీ అగ్ర నాయకత్వానికి ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. రాబోయే రోజుల్లో పార్టీ బలోపేతానికి మరింత ఉత్సాహంతో పని చేస్తామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.