న్యూస్ డెస్క్, (స్వతంత్ర ప్రభ)
గాజువాక శాసన సభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసంలో నిర్వహించిన కూటమి నాయకుల సమావేశంలో ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనలో సాధించిన అభివృద్ధి విజయాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలు, రాష్ట్ర పురోగతికి చేపట్టిన సంస్కరణలు, ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అంశాలపై విస్తృతంగా చర్చించారు.