కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ధన్యవాదాలు తెలిపిన
ఏ.ఐ.పి.టి. డబ్ల్యూ.ఎఫ్
న్యూస్ డెస్క్, (స్వతంత్ర ప్రభ)
ఆల్ ఇండియా పోర్ట్స్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (ఏ.ఐ.పి.టి. డబ్ల్యూ.ఎఫ్), బోర్డు ఆంధ్రప్రదేశ్ తరఫున దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కి హృదయపూర్వక కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాము. భారతదేశ మత్స్య, నౌకాశ్రయ, షిప్పింగ్ మరియు సముద్ర రంగాల అభివృద్ధికి ఆయన అందిస్తున్న దూరదృష్టి నాయకత్వం దేశ ప్రగతికి మార్గదర్శకంగా నిలుస్తోంది.అదేవిధంగా కేంద్ర పోర్ట్స్, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ కి, అలాగే పోర్ట్స్, షిప్పింగ్ మరియు జలమార్గాల శాఖ సహాయ మంత్రి శాంతను ఠాకూర్ గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. తీరప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి, మత్స్యకారుల సంక్షేమం మరియు సముద్ర రంగ ప్రగతికి వారు అందిస్తున్న సహకారం ప్రశంసనీయమైనది.ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. రాష్ట్ర అభివృద్ధిపై ఆయనకు ఉన్న దూరదృష్టి, సంకల్పబలం మరియు కార్యాచరణ వల్లే ప్రకాశం జిల్లాలో ప్రతిష్టాత్మకమైన రూ. 441.88 కోట్ల కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది.
అలాగే ఒంగోలు నియోజకవర్గ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము. ఈ ప్రాజెక్టు సాధనలో ఆయన చేసిన నిరంతర కృషి, ప్రజల పట్ల ఉన్న నిబద్ధత మరియు అభివృద్ధి పట్ల చూపిన చొరవ ప్రశంసనీయమైనవి.ఆంధ్రప్రదేశ్‌కు 1,053 కిలోమీటర్ల సుదీర్ఘ తీరప్రాంతం ఉండటం రాష్ట్రానికి ప్రత్యేక బలంగా నిలుస్తోంది. ప్రతి 50 కిలోమీటర్లకు ఒక పోర్టు ఆధారిత పరిశ్రమను అభివృద్ధి చేసి భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. ఈ దిశగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట వంటి గ్రీన్‌ఫీల్డ్ పోర్టుల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.ఈ ప్రధాన పోర్టుల అభివృద్ధికి సుమారు రూ. 20,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించబడుతున్నాయి. అదేవిధంగా కాకినాడలో రూ. 83,000 కోట్ల గ్రీన్ అమోనియా ప్రాజెక్టు, నక్కపల్లిలో రూ. 1 లక్ష కోట్ల స్టీల్ ప్లాంట్ వంటి భారీ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు ఆధ్వర్యంలో రూ. 1.5 లక్షల కోట్ల విలువైన అవగాహన ఒప్పందాలు (MoUs) కుదిరి, సుమారు 10 వేల ఉద్యోగ అవకాశాలు సృష్టించబడనున్నాయి. యువత మరియు తీరప్రాంత ప్రజలకు భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. వేలాది మంది మత్స్యకార కుటుంబాల జీవనోపాధి మెరుగుపడుతుంది.
చేపల ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్ మరియు ఎగుమతి సదుపాయాలు అభివృద్ధి చెందుతాయి.మత్స్య, సముద్ర మరియు అనుబంధ పరిశ్రమలకు ప్రోత్సాహం లభిస్తుంది.ప్రకాశం జిల్లా మరియు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతుంది. భారతదేశ బ్లూ ఎకానమీ అభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తుంది.ఈ చారిత్రాత్మక ప్రాజెక్టును ఆల్ ఇండియా పోర్ట్స్ ట్రస్ట్ వర్కర్స్ ఫెడరేషన్ హృదయపూర్వకంగా స్వాగతిస్తూ, కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తోంది. కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు విజయవంతంగా పూర్తై, తీరప్రాంత ప్రజలకు సుసంపన్న భవిష్యత్తును అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాము.