నూతన వధూవరులు సాకేత్, శ్రావణి దంపతులకు ఆశీర్వాదాలు
విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా మాజీ సి.ఏం వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ దక్షిణ నియోజకవర్గం సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటిని సందర్శించారు. ముందుగా పలు సాంస్కృతిక కార్యక్రమాలతో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని సాదరంగా ఆహ్వానించారు. మహిళలు హారతులిచ్చి పూలాభిషేకం చేశారు. జై జగన్.. సీఎం అంటూ వాసుపల్లి నివాసం వద్ద అశేష జనవాహిని కి జగన్మోహన్ రెడ్డి అభివాదాలు తెలిపారు. ముందుగా ఇటీవల వివాహం చేసుకున్న వాసుపల్లి రెండో కుమారుడు సాకేత్ , శ్రావణి లను ఆయన ఆశీర్వదించారు. వాసుపల్లి కుటుంబ సభ్యులతో ఫోటో దిగారు. అనంతరం వైసీపీ నేతలతో ఆయన మాట మంతి తెలిపారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పై స్పందించి, ప్రజల తరఫున పోరాటం చేయాలని పేర్కొన్నారు.చివరగా మనం ప్రజల మంచి కోసమే పోరాటం చేయాలని అన్నారు.ఈ విషయంలో ఎటువంటి రాజి పడవద్దు అని చెప్పారు.అలాగే పార్టీ బలోపేతానికి కూడా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని పిలుపునిచ్చారు. పనిచేసే ప్రతి కార్యకర్తను గుర్తించాలన్నారు.కార్యకర్తలు అందరిని కలుపుకొని వెళ్లాలని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం నియంతత్వ పోకడలకు శ్రీకారం చుట్టిందని, పార్టీ నేతలపై కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తూ, బెదిరింపులకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.ఎవరు అధైర్య పడవద్దు అని చెప్పారు. భవిష్యత్తు వైసిపిదే అని ధీమా వ్యక్తం చేశారు.ప్రతి ఒక్కరు ప్రజలతో మమేకమవుతూ, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాల కోఆర్డినేటర్ కన్నబాబు, మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కోలా గురువులు , మాజీ ఎమ్మెల్యేలు ధర్మాన ప్రసాదరెడ్డి, గొల్ల బాబురావు, తైనాల విజయ్ కుమార్, రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ సెల్ చైర్మన్ జాన్ వెస్లీ, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్ గాంధీ, జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, వైయస్సార్సీపీ నేతలు పేడాడ రమణకుమారి, ఆల్ఫా కృష్ణ, కార్పొరేటర్లు, దక్షిణ వార్డు అధ్యక్షులు సీనియర్ నాయకులు అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.