సౌత్ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య. నాయుడు

విశాఖ దక్షిణం,మార్చి :12(స్వతంత్ర ప్రభ)
సౌత్ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య. నాయుడు 31, 32, 38, 35, 34 వ వార్డులపరిధిలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్, రైల్వే స్టేషన్ రోడ్డు, బౌదర రోడ్డు, రామకృష్ణ రైతు బజార్ జంక్షన్, టౌన్ కొత్త రోడ్డు, మెయిన్ రోడ్డు ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు.ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఉదయం 7 గంటల లోపు ప్రధాన రహదారులన్నీ శుభ్రపరిచారా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. నగర పరిశుభ్రత నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని సంబంధిత సిబ్బందికి సూచించారు.అదేవిధంగా వార్డ్ నెం.32 లోని వాణిజ్య సముదాయాల నుండి వెలువడుతున్న చెత్తను తడి చెత్త – పొడి చెత్తగా వేరు చేసి సేకరిస్తున్నారా లేదా అనే అంశాన్ని కూడా తనిఖీ చేశారు.మరియు వార్డ్ నెం.38 లో త్వరలో ప్రారంభం కానున్న స్వచ్ఛ సర్వేక్షన్ కార్యక్రమం నేపథ్యంలో సంబంధిత వార్డ్ సెక్రటరీలతో సమీక్ష సమావేశం నిర్వహించి,నగరానికి మెరుగైన ర్యాంకింగ్ సాధించేందుకు చేపట్టవలసిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. స్వచ్ఛ సర్వేక్షన్‌లో మంచి ఫలితాలు సాధించేందుకు అధికారులు,సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ పర్యటనలో వార్డు సానిటరీ ఇన్స్పెక్టర్లు కామేశ్వర్ రెడ్డి, శివప్రసాద్, గంగాధర్ పాల్గొన్నారు.