విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని 39వ వార్డులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. గురువారం లక్ష్మి టాకీస్ జంక్షన్ వద్ద 39వ వార్డు అధ్యక్షులు ఎండీ ముజీబ్ ఖాన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా వార్డు నాయకులు, కార్యకర్తలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ ఆవిర్భావ దినోత్సవ సంతోషాన్ని పంచుకుంటూ స్థానిక ప్రజలకు పండ్లను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ మైనార్టీ అధ్యక్షులు బాబ్జి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయనతో పాటు వార్డు నాయకులు ఆది, ధనరాజు, ఆదిలక్ష్మి, ప్రసాద్, అప్పారావు, రమణ, అప్పలరాజు, దేవి, శ్రీను, కోటి, కాసుబాబు, నూకరత్నం తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.వైఎస్సార్ ఆశయ సాధనే లక్ష్యంగా, పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.