
విశాఖ దక్షిణం, మార్చి:14(స్వతంత్ర ప్రభ)
విశాఖ నగర జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు తో పాటు జిల్లా, వార్డు శ్రేణులు భారీగా చేరుకుని సంబరాలు జరుపుకున్నారు. సీతంపేట నగర కార్యాలయంలో జెండా ఆవిష్కరణ అనంతరం జనసేన పార్టీ నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. బైక్ ర్యాలీలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సీతంపేట కార్యాలయం నుంచి వరకు పార్టీ శ్రేణులతో కలసి స్వయంగా బైక్ నడిపి పార్టీ శ్రేణులలో ఉత్సాహం నింపారు. ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కలిసి పని చేద్దామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస తెలిపారు. అనంతరం జనసేన పార్టీ జగదాంబ జంక్షన్ లో భారీ కేక్ కటింగ్ , జెండా ఆవిష్కరణ చేసి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, నియోజకవర్గం ఇంచార్జీలు, ఉత్తరాంధ్ర మహిళా కో ఆర్డినేటర్ లు, జిల్లా సీనియర్ నాయకులు, జీవీఎంసీ కార్పొరేటర్లు, నామినేటెడ్ చైర్మన్ లు, డైరెక్టర్లు, మాజీ కార్పొరేటర్ లు, జనసేన పార్టీ వార్డ్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, భారీ సంఖ్యలో వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.