కొత్తవలస ఖండ గో సేవ ప్రముఖ్‌గా ‘నోముల రవి’ నియామకం

కొత్తవలస, మార్చి :25(స్వతంత్ర ప్రభ)

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (అర్.ఎస్.ఎస్) కొత్తవలస ఖండ గో సేవ ప్రముఖ్‌గా మంగళపాలెం నివాసి నోముల రవి నియమితులయ్యారు. హిందూ ధర్మ పరిరక్షణలో భాగంగా గో సేవ మరియు ధర్మ గోరక్షణ బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు సాగాలని సంఘ్ అధికారులు ఈ సందర్భంగా ఆయనకు దిశానిర్దేశం చేశారు.స్థానిక మంగళపాలెంలో నివసిస్తున్న నోముల రవిని ఈ కీలక పదవికి ఎంపిక చేస్తూ ఆర్‌ఎస్‌ఎస్ విజయనగరం విభాగ్ ప్రచారక్ రాజశేఖర్, విభాగ్ భౌతిక ప్రముఖ్ తిరుపతిరావు, మరియు విజయనగరం జిల్లా గో సేవ ప్రముఖ్ రమేష్ అధికారికంగా ప్రకటించారు.ఈ సందర్భంగా సంఘ్ ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. సమాజంలో గోమాత ప్రాముఖ్యతను చాటిచెప్పడంలోనూ, ధర్మ రక్షణలోనూ నోముల రవి చురుకైన పాత్ర పోషించాలని కోరారు. ముఖ్యంగా కొత్తవలస ఖండ పరిధిలో గో సేవ కార్యక్రమాలను విస్తృతం చేస్తూ, హిందూ ధర్మ మూలాలను కాపాడటంలో రవి నియామకం ఎంతో దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ఆర్‌ఎస్‌ఎస్ అధికారులకు నోముల రవి కృతజ్ఞతలు తెలిపారు. గోరక్షణే ధ్యేయంగా తన వంతు కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మంగళపాలెం గ్రామస్తులు మరియు రవి సన్నిహితులు ఆయన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలియజేస్తున్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *