విజయవంతంగా 34వ వార్డు డిజిటలైజేషన్
మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి టీమ్ కు అభినందనలు
విశాఖ దక్షిణం (స్వతంత్ర ప్రభ)
వైఎస్ఆర్సిపి అధిష్టానం ఆదేశాల మేరకు దక్షిణ నియోజకవర్గంలో క్యాడర్ రిజిస్ట్రేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ దాదాపుగా ముగిసాయి. ఈ నేపథ్యంలో 34వ వార్డు తోట పద్మావతి ఆధ్వర్యంలో ఆన్లైన్ డిజిటలైజేషన్ ముగిసిన సందర్భంగా వార్డ్ నేతలకు చిరు సత్కారం చేసి స్వీట్ బాక్స్ లు పంపిణీ చేశారు. 100% పూర్తి చేయడం పట్ల మాజీ కార్పొరేటర్ తోట పద్మావతి బృందాన్ని వాసుపల్లి అభినందించారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ వైసిపి గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు జగన్మోహన్ రెడ్డి నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్తున్నారన్నారు. కార్యకర్తలకు నేరుగా గుర్తింపు లభించే విధంగా ఈ డిజిటలైజేషన్ ప్రక్రియను ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగిందని తెలిపారు. కూటమి పార్టీలు ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చాయని, నేడు ప్రజలకు అది స్పష్టంగా తెలుస్తుందని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన రెండు ఏళ్లలోపే లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలను నెత్తిన మరింత భారం మోపిందని ధ్వజమెత్తారు.కూటమి నేతలు అధికారం అడ్డుపెట్టుకొని ఆస్తులు పెంచుకోవడం తప్ప ప్రజలకు పెద్దగా చేసింది ఏమీ లేదని మండిపడ్డారు.జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉన్నప్పుడు ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగాయని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ఎప్పుడు ముందుందని తెలియజేశారు.ప్రజా వ్యతిరేక పాలన సాగిస్తున్న కూటమి ప్రభుత్వం వచ్చే ఎన్నికలలో కూలిపోవడం తప్పదని జోష్యం చెప్పారు. ప్రజలు ఓటు ద్వారా ఈ పార్టీలకు బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత అధికారం చేపట్టేది వైసిపి లయే అని స్పష్టం చేశారు ఈ కార్యక్రమం లో జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,స్టేట్ నాయకులు బడిదబోయిన అప్పారావు, లండ రమణ,లింగం శ్రీను,వార్డ్ సచివాలయం అబ్జర్వ్ మరియు సోషల్ మీడియా ప్రెసిడెంట్ బేవార మహేష్,నాగుల శ్రీను,వాసుపల్లి ధనరాజు, సూరిబాబు, కడవల నాగమణి, గరికిన వెంకటేష్, విజయ,పూడి జయలష్మి,ఆశ, సత్యవతమ్మ,మంజు తదితరులు పోల్గున్నారు