మర్రివలస గ్రామంలో తాగు నీరు సౌకర్యం కల్పించాలి
సిపిఎం పార్టీ డిమాండ్
అల్లూరి జిల్లా, (స్వతంత్ర ప్రభ)
సిపిఎం పార్టీ బృందం మర్రి వలస గ్రామాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ చొంపి శాఖ కార్యదర్శి గెమ్మెలి జగన్నాథం మాట్లాడుతూ మర్రివలస గ్రామంలో సుమారు 15 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.ఈ గ్రామంలో గతంలో బోరింగ్ వేయించి వీధి కొళాయిలు వేయించడం జరిగింది. కానీ నీరు గ్రామ ప్రజల అవసరమైన నీరు సరిపోవడం లేదు.15 నిమిషాలు మాత్రమే నీరు వస్తున్నది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వేసవి వస్తుండడం తాగునీరు ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రభుత్వం అధికారులు వెంటనే స్పందించింది మర్రివలస గ్రామం ప్రజలకు సరిపడేటట్లు మంచినీరు సౌకర్యం కల్పించాలని సి పి ఏం పార్టీ డిమాండ్ చేస్తుంది. మాకు నీరు అందించలేనిపక్షంలో ఆందోళన చేస్తామని హెచ్చరిస్తున్నది.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు బి.కోగేశ్వరరావు, పార్టీ సభ్యులు దాసు, మర్రివలస గ్రామస్తులు పాల్గొన్నారు.