పాడేరు, (స్వతంత్ర ప్రభ)
అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులో పర్యటించిన రాష్ట్ర ట్రైబల్ మినిస్టర్ గుమ్మడి సంధ్యారాణి ని ఏపీ ఎన్జీజీవో జిల్లా అధ్యక్షులు లకె రవీంద్రబాబు పాత్రుడు మరియు జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ గుల్లేలి సింహాద్రి మర్యాద పూర్వకంగా కలిసి గిరిజన ప్రాంతంలో నెలకొన్న అల్లూరి జిల్లా జోనల్ ప్రాంత సమస్యపై వినతి పత్రం అందించారు. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్లు మరియు విద్యార్థులకు ఎదురాయే సమస్యలను వివరించడం జరిగింది.జోన్2 లో చేర్చడం వల్ల ఏర్పడే పరిస్ధితులను తెలుపుతూ పూర్వ విశాఖపట్నం జోన్ 1 లో కొనసాగించాలని మంత్రి నీ కోరడం జరిగింది.ఈ విషయంపై మంత్రి సానుకూలంగా స్పందిస్తూ, ఈ సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి,పరిష్కారం కోసం కృషి చేస్తానని తెలిపారు.పాడేరు మాజీ శాసన సభ్యులు గిడ్డి ఈశ్వరి మరియు కిడారి శ్రావస్ కూడా స్పందిస్తూ మంత్రి సంధ్యారాణి తో మాట్లాడుతూ.. ఈ సమస్యను తక్షణమే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కొరకు చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జి.సి.సి డి.యం డి సింహాచలం, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు యం ఈశ్వరరావు ప్రధాన కార్యదర్శి శేషాద్రి, ఏపీ ఎన్జీజీవో ఉపాధ్యక్షులు మఠం సూర్యనారాయణ నాయుడు పలువురు ఉద్యోగులు పాల్గొన్నారు.