గౌతమి ఆసుపత్రి సేవలు అభినందనీయం

ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ)

గౌతమి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిసేవలు అభినందనీ యమని శాసనసభ్యులు, ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్అన్నారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన సందర్భంగా గౌతమి ఆసుపత్రి వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తాడేపల్లిగూడెం వైద్య రంగంలో పురోగమిస్తోం దని అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయ న్నారు. పేదలకు అందుబాటు లో వైద్య సేవలు అందించాలని కోరారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గ బిజెపి కన్వీనర్ ఈతకోట తాతాజీ మాట్లాడుతూ గౌతమి ఆసు పత్రి యాజమాన్యం ముఖ్య మంత్రి జన్మదినోత్సవ సందర్భంగా రక్తదాన శిబిరం, ఉచిత నేత్ర వైద్య శిబిరం నిర్వహించడం ప్రశంసనీయ మని అన్నారు. ఈ సేవా కార్యక్రమాల్లో తమను కూడా భాగస్వాములు చేయటం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలకు ఆధునిక వైద్య సౌకర్యాలను అందుబాటులోకి తెచ్చారని, గౌతమి ఆసుపత్రి సేవలను ప్రజలు వినియోగిం చుకోవాలని కోరారు. గౌతమి యాజమాన్యం నక్కరామకృష్ణ, కావల సత్యనారాయణ, సిద్ధ గౌతమి, మద్దుకూరి ప్రకాశరావులు మాట్లాడుతూ రక్తదానంతో ఎంతోమంది ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని, అందుకు సహకరించిన దాతలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తమ ఆసుపత్రి ఆధ్వర్యంలో భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలియజేశారు.ఉచిత కంటి వైద్య శిబిరంలో పెద్ద సంఖ్యలో వైద్య పరీక్షలు నిర్వహిం చామన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే శ్రీనివాస్, ఈతకోట తాతాజీ, కూటమి నాయకులు,కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *