యాదవ కుటుంబానికి వాసుపల్లి ఆర్థిక సాయం

జోగా రమణ సతీమణి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

దక్షిణం, (స్వతంత్ర ప్రభ)

దక్షిణ నియోజకవర్గ ప్రజల ఆపద్బాంధవుడు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మరోసారి తన దాతృత్వం చాటుకున్నారు. సొంత నిధులతో నియోజకవర్గ పేదలకు అందిస్తున్న చేదోడు లో భాగంగా *29వ వార్డుకు చెందిన యాదవ కుటుంబానికి  రూ.10వేలు ఆర్థిక సహాయం అందజేసారు.  జోగా రమణ సతీమణి మృతి చెందడంతో 29వ వార్డు వైసిపి అధ్యక్షుడు పీతల వాసు ద్వారా వాసుపల్లి గణేష్ కుమార్ విషయం తెలుసుకొని ఆయన ఇంటికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. యాదవ వర్గంలో పెద్ద కుటుంబం గా నిలిచిన జోగా రమణ సతీమణి మృతి చెందడం ఆ కుటుంబానికి తీవ్ర విషాదం నింపిందన్నారు. అంత్యక్రియలకు గాను పదివేల రూపాయలు అందించి  కుటుంబ సభ్యులను పరామర్శించారు.యాదవ వర్గంలో జోగా రమణ కుటుంబానికి ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, పెద్ద కుటుంబంలో తనదైన బాధ్యతగా వారి సతీమణి  ఎంతో సేవలందించారన్నారు. ఆమె మృతి కుటుంబానికి తీరని లోటు అని అన్నారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆమె ఆత్మకు శాంతి కలగాలని మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా ఆర్టీఐ జనరల్ సెక్రటరీ ఆరుగుల రాజు, జిల్లా యూత్ జనరల్ సెక్రటరీ తమినేని శ్రీను,జిల్లా యూత్ సెక్రటరీ యలమంచిలి సంతోష్,సౌత్ బీసీ సెల్ ప్రెసిడెంట్ బొండదా వెంకటరమణ,సౌత్ ఆర్టీఐ ప్రెసిడెంట్ కోరాడ సురేష్, వైస్సార్సీపీ నాయకులు బుల్లెట్ రవి, పీతల వినయ్ తదితరులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *