విశాఖపట్నం, (స్వతంత్ర ప్రభ)
విశాఖ నగర పర్యటన లో భాగంగా విచ్చేసిన రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి మరియు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారిని తీర ప్రాంత వాడబలిజ అభివృద్ధి సంక్షేమ సంఘం కోర్ కమిటీ సభ్యులు తిత్తి సాయి బలరాం కలిసి రాష్ట్రంలో సముద్రతీరా ప్రాంతంలో చేపల వేట ప్రధాన వృత్తిగా తరతరాల నుండి ఆచరిస్తున్న వాడబలిజ మత్స్యకారులకు అభివృద్ధి సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చిన్నచిన్న కులాల కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, సముద్రంలో రోజుల తరబడి ప్రాణాలకు సైతం పణంగా పెట్టి వేటా కొనసాగిస్తున్న సమాజంలో సముచిత రాజకీయ సామాజిక ఆర్థిక విద్యాపరంగా తగిన గుర్తింపు లేని జాతిగా వాడబలిజ కులం ఉన్నదని, అదేవిధంగా వేటకు వెళుతూ పొరపాటున అంతర్జాతీయ జలాలకు వెళ్లడంతో పాకిస్తాన్ బంగ్లాదేశ్ శ్రీలంక వంటి దేశాలు భద్రతా బలగాలకు పట్టుబడడంతో వారి కుటుంబాలు తీరని వేదనకు గురవుతూ ఉన్న జాతి వాడబలిజ అటువంటి జాతి నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న పారిశ్రామిక ప్రగతి కోసం సాకుగా చూపి పర్యావరణ పరిరక్షణ కోసం ఎటువంటి చర్యలు తీసుకోకుండా సముద్ర జిల్లాలను వ్యర్ధాలతో నింపడం వలన మత్స్య సంపద కూడా కనుమరుగవుతుంది, ప్రస్తుత పరిస్థితులు వాడబలిజ జాతి కోసం అభివృద్ధి సంక్షేమం ధ్యేయంగా వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నారా లోకేష్ కి వినతిపత్రం అందించడం జరిగింది.