మహాత్మా పూలే అడుగు జాడల్లో కూటమి ప్రభుత్వం

ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

నెల్లూరు,(స్వతంత్ర ప్రభ)

నెల్లూరు నగరం మాగుంట లే అవుట్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి  మహాత్మా ఫూలే చిత్ర పటానికి పూల మాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ  మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వెనుకబడిన వర్గాల ఆర్థిక మరియు రాజకీయ ఎదుగుదల కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఆమె స్పష్టం చేశారు. మహాత్మా ఫూలే గారు ఆశించిన సామాజిక సమానత్వం దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  పేర్కొన్నారు. మహిళా విద్యే సామాజిక మార్పుకు అసలైన పునాది అని నమ్మిన ఫూలే దంపతుల కృషి నేటికీ ఆదర్శప్రాయమని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  కొనియాడారు. కుల వివక్ష లేని సమాజం కోసం మహాత్మా పూలే గారు సాగించిన పోరాటం దేశ చరిత్రలో చెరిగిపోని ముద్ర వేసిందని ప్రశంసించారు. అణగారిన వర్గాల గొంతుకగా నిలిచిన ఫూలే స్ఫూర్తితోనే కోవూరు నియోజకవర్గంలోని ప్రతి పేదవాడికి ప్రభుత్వ ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని ఆమె వెల్లడించారు. సమాజంలో అసమానతలను తొలగించి బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడటమే మహాత్మా పూలే కి  సమర్పించే అసలైన నివాళి అని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి  ఈ సందర్భంగా వెల్లడించారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *