
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు 38, 36, 35 వ వార్డుల పరిధిలోని వసంతరావు వీధి, టౌన్ హాల్ రోడ్, సీతారామ స్వామి టెంపుల్ రోడ్, సాయిబాబా టెంపుల్ రోడ్, చంగలరావుపేట, టౌన్ కొత్త రోడ్, పంజా జంక్షన్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు.ఈ పర్యటనలో వసంతరావు వీధి పరిసర ప్రాంతాల్లో కాలువల్లో చెత్త పేరుకుపోవడం గమనించబడింది. అలాగే కొత్తగా ఏర్పడుతున్న గార్బేజ్ వలర్ బుల్ పాయింట్లను గుర్తించి, వాటిని తక్షణమే పరిష్కరించే దిశగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత సానిటరీ ఇన్స్పెక్టర్‌ను ఆదేశించారు.
అదేవిధంగా వసంతరావు వీధిలో వ్యాపారాలు నిర్వహిస్తున్న వ్యాపారస్తులు తమ చెత్తను ఇంటి వద్దకు వచ్చే చెత్త తరలింపు వాహనానికి లేదా పారిశుధ్య కార్మికులకు తప్పనిసరిగా అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొన్ని వాణిజ్య సముదాయాలు పారిశుధ్య నియమాలను ఉల్లంఘించినందున అపరాధ రుసుము వసూలు చేయడం జరిగింది.ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న స్థలాల్లో చెత్త వేయకుండా సంబంధిత స్థల యజమానులకు నోటీసులు జారీ చేసి, అవసరమైన అపరాధ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కంచర వీధి ప్రాంతంలో కొత్త కాలువల నిర్మాణానికి సంబంధించిన తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు.ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ కృష్ణంరాజు గారు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్, సానిటరీ సూపర్వైజర్ కామేశ్వర్ రెడ్డి,సానిటరీ ఇన్స్పెక్టర్లు గంగాధర్,అప్పలరాజు,శివప్రసాద్,శానిటేషన్ సెక్రటరీలు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.