స్టీల్ ప్లాంట్ బాధితులకు కోటి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి!

బాధితులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని,  తక్షణమే ఒక్కొక్కరికి కోటి రూపాయలు చొప్పున నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త వాసుపల్లి గణేశ్ కుమార్ డిమాండ్ చేశారు. స్టీల్ ప్లాంట్ లో జరిగిన అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను మంగళవారం కేజీహెచ్ లో ఆయన పరామర్శించారు. బాధిత కుటుంబ సభ్యులను, వారి పిల్లలతో నేరుగా మాట్లాడి ప్రమాద స్థితిగతులతో పాటు చనిపోయిన వారి సాధరబాధలను అడిగి తెలుసుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు తామంతా అండగా నిలబడతామని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ
ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి పరిహారం ప్రకటించలేదు’ అని వాసుపల్లి మండిపడ్డారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని, జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మీరు కోరుకునే విధంగా తామంతా అండగా నిలబడి ఉంటామని వాసుపల్లి స్పష్టం చేశారు. ‘మృతుల పిల్లలకు ఆర్థికంగానూ, అన్ని రకాలుగా తమ వంతు సాయం చేస్తామన్నారు. మా ప్రభుత్వంలో ఎల్జీ పాలిమర్స్ ఘటనలో మృతిచెందిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున ఇచ్చామన్నారు. ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారని, మరో ముగ్గురు సెవెన్ హిల్స్ హాస్పిటల్ లో ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నారన్నారు. మరి కొంతమంది కిమ్స్ హాస్పిటల్ లో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని ఆకాంక్షించారు. అలాగే ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బాధితులు ఆరోగ్యకరంగా తిరిగి కోలుకోవాలని భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో  ఐఎన్టియుసి నాయకులు మంత్రి రాజశేఖర్, స్టేట్ ఆర్గనైజేషన్ సెక్రెటరీ లింగం శీను,జిల్లా జనరల్ సెక్రటరీ గనగల రామరాజు, జిల్లా ఉపాధ్యక్షులు రేయ్యి డేవిడ్ రాజు,జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్, సౌత్ సోషల్ మీడియా ప్రెసిడెంట్ బేవార మహేష్, సౌత్  వై.ఎస్.అర్.టి.ఎఫ్ దైవ కుమార్, సౌత్ స్టూడెంట్ సెల్ ప్రెసిడెంట్ వీటీ కృష్ణ కుమార్,కమల్ మనోహర,దక్షిణ వైఎస్ఆర్సిపి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *