ఘనంగా సువార్త రాజ్ ( బుజ్జి) జన్మదిన వేడుకలు

నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సువార్త రాజ్ ( బుజ్జి ) పుట్టినరోజు వేడుకలు బుధవారం విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిధిలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో పార్టీ నాయకులు,కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున కేక్ కటింగ్స్,అన్నదానాలు,సేవా కార్యక్రమాలు నిర్వహించారు.వేడుకల్లో భాగంగా ఉదయం 7:00 గంటలకే ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి జ్ఞానాపురం రైల్వే స్టేషన్ వరకు నిరుపేదలకు అల్పాహార పంపిణీ కార్యక్రమం చేపట్టారు….అనంతరం ఉదయం 8:00 గంటలకు కృపామయ ప్రార్థన సహవాసంలో సేవకులు మేరీ జోసెఫ్ మరియు సంఘస్తుల సమక్షంలో సువార్త రాజ్‌ను శాలువాతో సత్కరించి,జీసస్ ఫోటో ఫ్రేమ్‌ను బహుకరించి,ఆశీర్వాద ప్రార్థనలతో కేక్ కటింగ్ చేశారు. మరోవైపు 35వ వార్డు పూర్ణ మార్కెట్ దుర్గమ్మ గుడి జంక్షన్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్ల విజయ్ (బుజ్జి),భప్పి,ప్రేమ్ కుమార్ ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి సువార్త రాజ్‌ను పార్టీ కండువా, శాలువాతో ఘనంగా సత్కరించి కేక్ కట్ చేయించారు. అక్కడకు వచ్చిన వారందరికీ 200 మజ్జిగ ప్యాకెట్లు, బనానా కేకులను పంపిణీ చేశారు. అలాగే దుర్గమాంబా సేవా సంఘం యు.సి.సి క్లబ్ సెంటర్లో వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు తర్లాడ గోవిందు, రెడ్డి (కఠారి కృష్ణ) ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు మజ్జిగ, అరటి పండ్లు,కేకులను అందజేశారు.…..సాయంత్రం 7:00 గంటలకు వైఎస్ఆర్ సీపీ సీనియర్ నాయకులు రంగాల రవికుమార్, పుట్టా రాంబాబు, రామ్ తేజ, సిమ్మా పుష్ప ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి, బాణాసంచా కాలుస్తూ కేక్ కట్ చేశారు. అనంతరం పెరికి వీధి స్థానికులకు, కార్యకర్తలకు స్వీట్లు, సమోసాలు, డ్రింక్స్ పంపిణీ చేశారు. అలాగే సాయంత్రం 7:30 గంటలకు ఆయిల్ మిల్లు సందు కర్రల కొట్టు దగ్గర లండా సుధాకర్, దళాయి నూకరాజు (లీల) ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి కేక్ కటింగ్ చేసి స్వీట్లు, సమోసాలు, డ్రింక్స్ అందజేశారు….మహేష్ బాబు అభిమానులు కూడా ఈ వేడుకల్లో భాగస్వామ్యమయ్యారు. రాత్రి 8:00 గంటలకు చిన దుర్గాలమ్మ గుడి సెంటర్ వద్ద మహేష్ బాబు ఫ్యాన్స్ కిరణ్, పీతల శ్రీను ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, చిన్న పిల్లలకు బుక్స్, పెన్నులు, పెన్సిళ్లు, స్వీట్లను పంపిణీ చేశారు. రాత్రి 8:30 గంటలకు సరస్వతి పార్క్ వద్ద కృష్ణ-మహేష్ బాబు అభిమానుల సమక్షంలో కేక్ కటింగ్ చేసి స్వీట్లు, లస్సీలను పంపిణీ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా రోజంతా జరిగిన ఈ సేవా కార్యక్రమాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన విభాగ ప్రతినిధులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సువార్త రాజ్‌కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *