ఘనంగా పూజలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన
చొక్కాకుల రాంబాబు

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
దేశ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ విజయవంతంగా 12 సంవత్సరాల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం నగరంలో ప్రత్యేక పూజలు, సర్వమత ప్రార్థనలు ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా మాజీ ఉపాధ్యక్షులు చొక్కాకుల రాంబాబు ఆధ్వర్యంలో పలువురు బీజేపీ నాయకులు, మోదీ అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా మొదట స్థానిక శ్రీ శ్రీ శ్రీ విజయ కనకదుర్గ కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేరిట ప్రత్యేక అర్చనలు, పూజలు నిర్వహించారు. అనంతరం సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటుతూ స్థానిక చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేయడం జరిగింది.ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు చొక్కాకుల రాంబాబు మాట్లాడుతూ, నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. భగవంతుని దయ వల్ల రాబోయే రోజుల్లో మోదీ నాలుగోసారి కూడా ప్రధానమంత్రి అవ్వాలని, అది తమ అందరి బలమైన ఆశ, ఆకాంక్ష అని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మైనార్టీ సీనియర్ నాయకులు బి.ఓ. ఆల్బర్ట్, బీజేపీ నాయకులు దశమంతల స్వామి, జగదీష్ కుమార్, దశమంతుల, అలాగే ఇంటర్నేషనల్ అవేంజెలిస్ట్ పాస్టర్ రెవరెండ్ డేవిడ్ తదితరులు పాల్గొని ప్రధానికి మద్దతుగా ప్రార్థనలు చేశారు.