Connect with us

Hi, what are you looking for?

AP NEWS

తెలంగాణలో రాజకీయ విస్తరణకు జనసేన కార్యాచరణ.. ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండా

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజకీయ ప్రస్థానాన్ని మరింత విస్తరించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు పేర్కొన్నాయి.అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడిన చరిత్ర,ఆత్మగౌరవ సాధన కోసం సాగిన ఉద్యమాల స్ఫూర్తితో రాష్ట్రంలో ప్రజా సమస్యలపై చురుకైన పాత్ర పోషించనున్నట్లు స్పష్టం చేశాయి. ప్రజల పక్షాన నిలుస్తూ,వారి సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేపట్టడం,సామాజిక అంశాలపై స్పందించడం, ప్రభుత్వాల దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపాయి.రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ నిర్మాణాన్ని పటిష్టం చేయనున్నట్లు వెల్లడించాయి.ముఖ్యంగా యువత,మహిళలు,రైతులు, కార్మికులు,ఉద్యోగులు,మేధావులను రాజకీయ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడానికి చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నాయి.బీసీలు,ఎస్సీలు,ఎస్టీలు,మైనార్టీలు సహా బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించడం,కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం పార్టీ ప్రధాన లక్ష్యాల్లో ఒకటిగా ఉందని వివరించాయి.సామాజిక న్యాయం,సమాన అవకాశాల సాధన దిశగా కార్యక్రమాలను విస్తరించనున్నట్లు పేర్కొన్నాయి.ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం,ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యం,పారదర్శక రాజకీయ విధానాలతో తెలంగాణలో బలమైన రాజకీయ ప్రత్యామ్నాయంగా ఎదగాలనే సంకల్పంతో జనసేన ముందుకు సాగుతోందని పార్టీ నాయకులు వెల్లడించారు.ప్రజల ఆకాంక్షల సాధన, రాష్ట్ర అభివృద్ధి,యువత భవిష్యత్ నిర్మాణమే తమ రాజకీయ ప్రయాణానికి ప్రధాన లక్ష్యాలని స్పష్టం చేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...

AP NEWS

విశాఖ దక్షిణం, జూలై:16(స్వతంత్ర ప్రభ) గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు  27వ వార్డులోని డైమండ్ పార్క్, నెహ్రూ బజార్ రోడ్, శ్రీనగర్,...