వన్ టౌన్ పోలీసులు రిమాండ్‌కు తరలింపు
వన్ టౌన్,(స్వతంత్ర ప్రభ)
వృద్ధుడిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు వన్ టౌన్ సీఐ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.పోలీసుల కథనం ప్రకారం.. వన్ టౌన్ పరిధిలోని రంగిరాజు వీధికి చెందిన కుందేటి దివాకర్ అనే వృద్ధుడిపై, అదే ప్రాంతానికి చెందిన వంగలపూడి యాదవ్ (అలియాస్ ‘కోడి’) గత ఆదివారం సాయంత్రం దాడికి తెగబడ్డాడు. రంగిరాజు వీధిలోని శ్రీ నీలామాంబ గుడి సమీపంలో బాధితుడిని విచక్షణారహితంగా కొట్టినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి, నిందితుడు వంగలపూడి యాదవ్‌ను శుక్రవారం అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు.”వన్ టౌన్ ఏరియాలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే లేదా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే ఉపేక్షించేది లేదు. కఠిన చర్యలు తప్పవు.”
అని , వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సి ఐ పూడి వరప్రసాద్ తెలియజేశారు.ప్రాంతంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా లేదా శాంతిభద్రతల సమస్యలు తలెత్తినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని ఈ సందర్భంగా సీఐ ప్రజలను కోరారు.





