Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

దస్తావేజు లేఖరుల నిరసన కార్యక్రమానికి సంఘీభావం

సంగీభావం తెలియజేసిన.కాకాణి గోవర్ధన్ రెడ్డి, పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి

నెల్లూరు, (స్వతంత్ర ప్రభ ప్రతినిధి )

నెల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయ ఆవరణలో  జీఒ 396 ను రద్దు చేయాలని కోరుతూ..నల్ల రిబ్బన్లు ధరించి.. నిరసన చేస్తున్న దస్తావేజు లేఖరులకు వైసిపి జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి వైఎస్ఆర్సిపి నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సంఘీభావం తెలియజేశారు.ఈ సందర్బంగా దస్తావేజుల లేఖరులతో మాట్లాడి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.కూటమి ప్రభుత్వం 396 జిఒ తీసుకువచ్చి  దస్తావేజు లేఖరుల పొట్ట కొట్టడం దుర్మార్గమని కాకాణి గోవర్ధన్ రెడ్డిఅన్నారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి.. ఈ రాష్ట్రంలో అన్ని ప్రైవేటు పరం చేస్తూ.. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటుకు దారాదత్తం చేస్తుందని  మండిపడ్డారు.గత వైసిపి ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలో కూడా ప్రైవేటుపరం  చేయాలని చంద్రబాబు నాయుడు.. విశ్వ ప్రయత్నం చేశారని అన్నారు.దీనిపై వైయస్ జగన్మోహన్ రెడ్డి  చేసిన పోరాటానికి.. కూటమి ప్రభుత్వం వెనక్కి తగ్గి.. మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నిర్వహించేలా నిర్ణయం తీసుకుందన్నారు.ఈ రోజు ప్రభుత్వం  జీవో నెంబర్ 396ని తీసుకువచ్చి..దస్తావేజు లేఖరులను రోడ్డుపాలు చేయడం అత్యంత దుర్మార్గమన్నారు.ఈ జి ఒ నెంబర్ 396 ద్వారా ప్రైవేటు సంస్థలకు.. రిజిస్ట్రేషన్  సేవలను అప్పగించాలని చూడడం శోచనీయమన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయ సేవలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తే.. ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి.. వ్యవస్థలు కుప్పకూలే అవకాశం ఉందన్నారు.సబ్ రిజిస్టర్ కార్యాలయాల వద్ద.. దస్తావేజుల లేఖరుల.. సేవల ద్వారా రిజిస్ట్రేషన్ సేవలను ప్రజలు ఎంతో సులభంగా పొందగలుగుతున్నారని తెలిపారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 396 వీరి పాలిట శాపంగా మారిందన్నారు.  396 జీవోను రద్దుచేసి.. దస్తావేజు లేఖరుల ఉపాధికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.దస్తావేజు లేఖరుల సేవలకు ఆటంకంగా మారిన 396 జీఒ ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...