మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి
ఎ ఎస్ ఆర్ జిల్లా,(స్వతంత్ర ప్రభ)
జిల్లాస్థాయి విలువిద్య పోటీలను ప్రారంభించిన మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి అల్లూరి జిల్లా పాడేరులో గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి విలువిద్య పోటీల ప్రారంభోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉంది.గిరిజన ప్రాంతాల్లో విలువిద్య అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, మన సంస్కృతి, సంప్రదాయాల్లో భాగంగా తరతరాలుగా కొనసాగుతున్న గొప్ప వారసత్వం. ఈ వారసత్వాన్ని నేటి యువత క్రీడారంగంలో విజయాలుగా మలచడం అభినందనీయం.ఈ పోటీల్లో పాల్గొంటున్న ప్రతి విద్యార్థికి నా అభినందనలు. గెలుపు, ఓటములు సహజం. పోటీల్లో పాల్గొని మీ ప్రతిభను ప్రదర్శించడమే గొప్ప విజయం. మీరు భవిష్యత్తులో రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, రాష్ట్రానికి కీర్తి తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాను.గిరిజన విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఐటీడీఏల ద్వారా శిక్షణ, అవసరమైన క్రీడా సామగ్రి, మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అన్ని విధాలుగా అండగా ఉంటాం.గిరిజన యువత చదువుతో పాటు క్రీడల్లోనూ ముందంజలో ఉండాలి. అదే సమయంలో మాదకద్రవ్యాలు, గంజాయి వంటి దురలవాట్లకు దూరంగా ఉంటూ తమ బంగారు భవిష్యత్తును నిర్మించుకోవాలి. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకం. గిరిజన ప్రాంతాల్లో యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, జాబ్ మేళాల ద్వారా గిరిజన యువతకు ఉపాధి అవకాశాలను మరింత విస్తరిస్తాం.గిరిజనుల విద్య, క్రీడలు, ఉపాధి, సంక్షేమం అనే నాలుగు అంశాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ వారి సమగ్ర అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యంగా ముందుకు సాగుతోంది.ఈ జిల్లాస్థాయి విలువిద్య పోటీల్లో పాల్గొంటున్న ప్రతి విద్యార్థికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీలో ఎంతో మంది భవిష్యత్తులో భారతదేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.





