Connect with us

Hi, what are you looking for?

AP NEWS

ఆత్మహత్యాయత్నానికి సిద్ధమైన యువకుడిని కాపాడిన వన్‌టౌన్ పోలీసులు

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు

విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ)

ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బీచ్ వద్ద ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు వెంటనే అప్రమత్తమయ్యారు.బ్లూ కాట్స్ కానిస్టేబుళ్లను ఘటనాస్థలికి పంపించి యువకుడిని సురక్షితంగా కాపాడి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. అనంతరం అతనితో మాట్లాడి సమస్యలను తెలుసుకున్న పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించి మనోధైర్యం కల్పించారు. ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగం కారణంగా జీవితంపై విరక్తి చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు యువకుడు పోలీసులకు తెలిపాడు.యువకుడి పరిస్థితిని అర్థం చేసుకున్న పోలీసులు అతని ప్రాథమిక అవసరాల నిమిత్తం ఆర్థిక సహాయం అందించారు. అనంతరం అతని స్నేహితుడిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి, యువకుడిని సురక్షితంగా అప్పగించారు. పోలీసుల కౌన్సిలింగ్‌తో ధైర్యం పొందిన యువకుడు ఇకపై ఇలాంటి చర్యలకు పాల్పడబోనని హామీ ఇచ్చాడు. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొని, కష్టపడి తనను తాను నిరూపించుకుంటానని తెలిపాడు. తన జీవితాన్ని మార్చుకుని ముందుకు సాగుతానని పేర్కొంటూ, తనను సకాలంలో కాపాడి మనోధైర్యం కల్పించిన పోలీసులకు కృతజ్ఞతలు తెలిపాడు.ఈయన ప్రాణాలు కాపాడడంలో చురుకుగా వ్యవహరించిన వన్టౌన్ సీఐ వరప్రసాద్ మరియు  కానిస్టేబుల్స్ రామకృష్ణారెడ్డి మరియు సురేష్ లను ఉన్నతాధికారులు అభినందించడం జరిగింది.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

విశాఖ దక్షిణం, జూలై:16(స్వతంత్ర ప్రభ) గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం. మల్లయ్య నాయుడు  27వ వార్డులోని డైమండ్ పార్క్, నెహ్రూ బజార్ రోడ్, శ్రీనగర్,...