Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి

ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ  డిమాండ్

ఎ ఎస్ ఆర్ జిల్లా,(స్వతంత్ర ప్రభ)

,అల్లూరి సీతారామరాజు జిల్లా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అలాగే ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ పిలుపు మేరకు అరకు లోయ మండల కేంద్రంలోని 1/70 చట్టం పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గిరిజన ప్రాంతంలో 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని అఖిల పక్ష ఉద్యోగ , ఉపాధ్యాయ ప్రజా సంఘాలు కలిసి  ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి డా బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమం లో అరకు ఎమ్మెల్యే రేగం మత్యలింగం,అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు మసడ ఈశ్వరరావు , ప్రధాన కార్యదర్శి ఎం.శేషాద్రి ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రామారావు దొర మాట్లాడుతూ రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న ఆదివాసి చట్టాలు 1/70, పెస చట్టం, అడవి హక్కుల చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు,అలాగే జీవో నెంబర్ 3 పునరుద్ధరణ చేసి స్థానిక గిరిజనుల కే 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు.గిరిజనులకు రక్షణ కవచమైన 1/70 చట్టాన్ని సవరించి తమకు గిరిజన ప్రాంతంలో సర్వహక్కులు కల్పించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వారిపై ఎన్టీఆర్  కేసులు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సంబంధిత అధికారులను కోరారు,అనంతరం అరకులోయ తహశీల్దార్ కు వినతి పత్రాన్ని అందజేశారు.వినతి పత్రం సమర్పించిన వారిలో అఖిలపక్షం నాయకులు చిన్నారావు, ప్రకాష్, శాంతి కుమారి, చాణక్య, అశోక్, పరశురాం, అరకు జోన్ ఉద్యోగ సంఘం నాయకులు పి.నందు, గురుదొర, సింహాచలం,ధనుర్జయ్,రామ్ ప్రసాద్, మండల అధ్యక్షుడు ఆనంద్ రావు,చందు, ప్రసాద్ (పిడి) పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...