నెల్లూరు,( స్వతంత్ర ప్రభ ప్రతినిధి)
అనంతసాగరంమండలం సోమశిలప్రాజెక్టు వద్ద జరుగుతున్నడైవర్షన్ ఛానల్ కుడివైపు రిటైనింగ్ వాల్ పనులను సోమవారం ప్రాజెక్టు సూపరింటెండెంటింగ్ ఇంజనీర్ మరియు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి తెలుగు గంగ చీఫ్ ఇంజనీర్ ఏం ఎల్ ఎన్ వరప్రసాద్ పరిశీలించి గుతైధారులకు మరియు ఇంజనీరింగ్ అధికారులకు పలుసూచనలు చేశారు.. పనుల నాణ్యతను ఎప్పటి కప్పుడు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పర్యవేక్షించి సకాలంలో పనులు పూర్తిచేయాలని ఆదేశించారు.. పై కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు పర్యవేక్షక ఇంజినీర్ రామచంద్ర మూర్తి, క్వాలిటీ కంట్రోల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కే. ధనంజయ నాయుడు, ప్రాజెక్టు డివిజన్ నెంబర్ 1 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. నివాస కుమార్ మరియు 4వ డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్.రాజశేఖరరెడ్డి, ప్రాజెక్టు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లుఎన్.రవీంద్ర ప్రసాద్, పై. మల్లికార్జున రావు, కె. విజయ్ బాబు, ఏం. మురళి కృష్ణారెడ్డి, క్వాలిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాజేంద్ర ప్రసాద్, అసిస్టెంట్ ఇంజనీర్లు పి. నిఖిల్, డి. శరత్ చంద్ర,డి. పెద్దిరాజు, “ఎస్కే. బాబుమియా, క్వాలిటీ కంట్రోల్ అసిస్టెంట్ ఇంజనీర్లు వెంకటరెడ్డి, “కామాక్షి, గుత్తేదారులు బి.వెంకటేశ్వర్లు, మరియు ప్రాజెక్టు సిబ్బంది పాల్గొన్నారు.





