ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
శ్రీ కాళహస్తి,(స్వతంత్ర ప్రభ)
మెగా డీఎస్సీపై వైసీపీ నిరాధారమైన అబద్ధపు ప్రచారం చేస్తోందని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు.మంగళవారం నిర్వహించిన ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ…16,347 ఉపాధ్యాయ పోస్టులను అత్యంత పారదర్శకంగా భర్తీ చేసి,అభ్యర్థుల వివరాలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచామని,వచ్చిన ప్రతీ ఫిర్యాదుకు విద్యాశాఖ ద్వారా పరిష్కారం చూపినట్లు తెలిపారు.వైసీపీ ఆరోపణల్లో నిజముంటే జాతీయ మీడియా సమక్షంలో గానీ లేదా మంత్రి నారా లోకేష్‌తో డిబేట్‌కు రావాలని,లేదంటే తాడేపల్లిలోని జగన్ నివాసంలోనైనా చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెచ్చిన విప్లవాత్మక సంస్కరణలు,‘తల్లికి వందనం’ పథకాల వల్ల ఈ ఒక్క ఏడాదే లక్షకు పైగా విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలు వదిలి ప్రభుత్వ బడుల్లో చేరారని కొనియాడారు.అసెంబ్లీకి రాకుండా కాలయాపన చేస్తూ,యువత భవిష్యత్తుతో ఆడుకుంటున్న వైసీపీ నేతలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.





