
తాడేపల్లిగూడెం,:(స్వతంత్ర ప్రభ)
గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ బలుసుల అమ్మవారి శాకంబరిమాత అలంకరణతో ప్రజలందరికీ శాంతి, సుభిక్షం కలగాలని శాసనసభ్యులు, రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ ఆకాంక్షించారు. ఆషాడ మాసం సందర్భంగా స్థానిక బలుసులమ్మ వారి ఆలయంలో శుక్రవారం శాకంబరి అలంకరణ ఉత్సవం నిర్వహించారు.ఆలయ నిర్వాహకుడు శ్రీరంగం అంజిబాబు కుటుంబం సౌజన్యంతో భక్తులకు అన్న సమారాధన నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరుల్లి కూరగాయల వర్తక సంఘాల సహకారంతో 15టన్నుల కూరగాయలతో అలంకరణ చేసి ఎంతో వైభవంగా ఉత్సవాలు నిర్వహిస్తున్న ఆలయ నిర్వాహకులను అభినందించారు. బలుసులమ్మ ఆలయంలో నిరంతరం శోభాయమానంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ, శాంతి సంతోషాలను కలగచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.





