Connect with us

Hi, what are you looking for?

Tadepalligudem

చిరు వ్యాపారులకు డైమండ్స్ లయన్స్ గొడుగులు పంపిణీ

తాడేపల్లిగూడెం,(స్వతంత్ర ప్రభ)

అంతర్జాతీయ న్యాయ దినోత్సవం   సందర్బంగా జిల్లా లయన్స్ పాస్ట్ గవర్నర్  న్యాయవాది లయన్ గట్టిం మాణిక్యాల రావు చేతులు మీదుగా స్ట్రీట్ వెండర్స్ కి గొడుగులు పంపిణీ చేశారు  ఈ సందర్బంగా లయన్ గట్టిం మాణిక్యాల రావు మాట్లాడుతూ (వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్) అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్  ఏర్పాటుకు కారణమైన ‘రోమ్ శాసనం’ 1998 జూలై 17న ఆమోదం పొందిన దానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు.అలాగే, ప్రపంచవ్యాప్తంగా సామాజిక అసమానతలను రూపుమాపాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 20న ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం (వరల్డ్ డే ఆఫ్ సోషల్ జస్టిస్) అని కూడా జరుపుకుంటారని అన్నారు   రీజియన్  ఛైర్ పర్సన్ లయన్ పేరిచర్ల మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ న్యాయదినోత్సవం సందర్బంగా న్యాయ శాఖలో ఉన్న ప్రతి ఒక్కరికి లయన్స్ క్లబ్స్ తరుపున శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము అని అలానే చిరు వ్యాపారాలు చేసుకొనే పేదలకు సహకారం గా లయన్స్ క్లబ్స్ పని చేస్తున్నాయి అన్నారు డైమండ్స్ ప్రసిడెంట్ చెన్నా రెడ్డి సతీష్.ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం లో విశ్వ సాహితీ సమాఖ్య పౌండర్ ఛైర్ పర్సన్ కొల్లి రామావతి   న్యాయవాది లయన్స్ లయన్ గట్టిం మాణిక్యాల రావు ని శాలువా తో సత్కరించి మొక్క ని అందించారు ఈ కార్యక్రమం లో లయన్స్ కృష్ణకాంత్, ఆకుల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...