విశాఖపట్నం,(స్వతంత్ర ప్రభ)
తూర్పు బంగాళాఖాతం విశాఖపట్నం సాగరంలో ఇటీవల ప్రకృతి విలయానికి ఆరుగురు మత్స్యకారులు మృత్యువాత పడడం దురదృష్టకరమని మాజీ మంత్రి మాజీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు.. శనివారం ఉదయం ఆయన విశాఖ నగరానికి చేరుకొని మృత్యువాత పడ్డ కుటుంబాలను పరామర్శించారు.. అనంతరం మృతుల కుటుంబాలకు ఆయన ఆర్థిక సాయం అందజేశారు… ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీలకతీతంగా తాను ఇక్కడికి వచ్చానని మృతుల కుటుంబాలు కు మనోధైర్యం కల్పించి. తనకు నచ్చిన సాయం వ్యక్తిగతంగా ఆయన చేసినట్లు వివరించారు. ప్రభుత్వం నిబంధనల మేరకు ప్రభుత్వం చేయవలసిన సహాయం చేసిందని. అయినా బోటు పూర్తిగా డామేజ్ జరగడంతో ప్రభుత్వ పెద్దలు. నాయకులతో మాట్లాడి మరి కొద్దిగా న్యాయం జరిగేలా చూస్తానని ఆ కుటుంబాలకు హామీ ఇచ్చారు… నడి సముద్రంలో 12 గంటల పాటు మృత్యువుతో పోరాడి మృత్యువాత పడ్డ మత్స్యకారు కుటుంబాలను ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఆదుకుంటుందని అన్నారు… ఈ కార్యక్రమంలో మత్స్యకారుల సంఘం నాయకులు వాసుపల్లి జానకిరామ్,తెడ్డు శంకర్, విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియుల సంగం అధ్యక్షులు అంగ రాంప్రసాద్.. ప్రధాన కార్యదర్శి మురళీకృష్ణ రాజు.. మత్స్యకారు నాయకులు తెడ్డు రామదాస్, సింగిడి సూరిబాబు స్థానిక మత్స్యకార కుటుంబాలు తదితరులు పాల్గొన్నారు.





