ప్రజలు స్కాన్ చేసి తమ అభిప్రాయాలు తెలియ జేయవచ్చని సూచన: జిల్లా కలెక్టర్
విశాఖపట్నం,స్వతంత్ర ప్రభ)
ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్)పై ప్రజల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరించేందుకు జిల్లా, మండల స్థాయి పీజీఆర్‌ఎస్ కేంద్రాల్లో సిటిజన్ ఫీడ్‌బ్యాక్ క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఎం. అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. పీజీఆర్‌ఎస్ కేంద్రాల ప్రవేశ, నిష్క్రమణ ప్రాంతాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూఆర్ కోడ్‌లను ఏర్పాటు చేయాలన్నారు. క్యూఆర్ కోడ్‌లు దెబ్బతిన్నా లేదా తొలగిపోయినా వెంటనే పునరుద్ధరించాలని, ప్రజలకు అవగాహన కల్పించేలా విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు.పీజీఆర్‌ఎస్ సేవలు పొందిన ప్రజలు తమ మొబైల్ ఫోన్లతో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి సేవలపై తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేయవచ్చని కలెక్టర్ సూచించారు. పీజీఆర్‌ఎస్ సేవలను మరింత మెరుగుపరిచేందుకు ప్రజల ఫీడ్‌బ్యాక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంటూ ప్రకటనతో పాటు ప్రభుత్వం రూపొందించిన క్యూఆర్ కోడ్ ను జతచేశారు.





