Connect with us

Hi, what are you looking for?

పాడేరు

తప్పుడు కేసులకు భయపడేది లేదు. గిరిజన సంఘం..

జులై 24 రాష్ట్ర ముఖ్య మంత్రి ఇచ్చిన హామీ అమలు చేయవలసిందే..

తప్పుడు కేసులకు భయపడేది లేదు..

పాడేరు,(స్వతంత్ర ప్రభ)

రాష్ట్ర ముఖ్యమంత్రి  ఆదివాసీలకు ఇచ్చిన హామీని, ప్రత్యామ్నాయ జి.ఓ రూపంలో జులై 24న రంపచోడవరం వస్తున్న సందర్భంగా అమలుకు ఉత్తర్వులు ఇవ్వవలసిం దేనని ఆదివాసీ గిరిజన సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు పి అప్పలనరస డిమాండ్ చేశారు.పాడేరు ఆదివాసీ గిరిజన సంఘం కార్యాలయం లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో డి ఎస్ సి సాధన కమిటీ నాయకులు కూడ రాధ కృష్ణ,వై. కుమార్, కార్తీక్ తో కలిసి పి. అప్పల నరస మాట్లాతూ అల్లూరి జిల్లా పాడేరులో జరిగిన “ జూలై 17 చలో పాడేరు” మహాధర్నాలో కొందరు నేతలు చేసిన ఆవేశపూరిత వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రకటించి, ఇప్పటికే 18 మందిపై కేసులు నమోదు చేశారు.ప్రభుత్వ ఆస్తులు.. ప్రజల ఆస్తులే వాటిని  ధ్వంసం చేయడం మా ఉద్యమ విధానం కాదు.అయినా, పాడేరు వస్తున్న ఆదివాసీ ప్రజలను ఉదయం నుంచి **కావాలని పోలీస్లు ఇబ్బందులు** కల్పించడం, కొత్త పోలీస్ అవుట్పోస్టులు పెట్టి తనిఖీలు చేసి జూలై 17  మహాధర్నాకు రాకుండా **అడ్డుకోవడం** దారుణం. జూలై 11 న మహా ధర్నాకు,నిరసనకు అనుమతి కోరి దరఖాస్తు చేశాం. మైక్ పర్మిషన్ కోసం చలన కూడా తీసాం. చివరి నిమిషం వరకు అనుమతి ఇస్తామని చెప్పడంతో వేలాది మంది ఆదివాసీ ప్రజలు శాంతియుతంగా పాల్గొన్నారు. అయినా ప్రభుత్వం ఉద్యమ నాయకులపై తప్పుడు కేసులు బనాయించి, రోడ్లు బ్లాక్ చేశారని, అనుమతి లేదని, పోలీసు విధులకు అడ్డంకి కలిగించారని కేసులు పెట్టింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము.బాక్సైట్, హైడ్రో ప్రాజెక్టుల్లో అక్రమ సర్వేలు చేసిన వారిపై,1/70 చట్టం ఉల్లంఘనలపై కేసులు నమోదు చేయడానికి శ్రద లేని ప్రభుత్వం…ఆదివాసీ ఉద్యమానికి మద్దతు ఇచ్చే ఆదివాసీ ఉద్యోగులను బెదిరించడం, చర్యలు తీసుకుంటామని, మోమోలు ఇస్తామని బెదిరింపులు చేయడం వంటి అణచివేత చర్యలను ప్రస్థావిస్తూ, ప్రభుత్వం నిర్భంధం నేపథ్యంలో  జూలై 17పాడేరు ధర్నాలో జిల్లా కలెక్టర్ కార్యాలయాన్ని బద్దలు కొడతామని నా ఉపన్యాసంలో వాడిన పదానికి నేను విచారం వ్యక్తం చేస్తున్నాను** మా ఉద్యమాల చరిత్రలో ఏనాడూ ఇటువంటి సందర్భం రాలేదు.బహిరంగ వ్యాఖ్యలపై తక్షణం కేసులు పెట్టడంలో చూపుతున్న ఉత్సాహం, రాజ్యాంగపరమైన హక్కులు అమలు చేయడంలో మాత్రం చూపుతున్న **నిర్లక్ష్యం** సరికాదు. సమస్యల మూలాలను పరిష్కరించకుండా కేవలం అణచివేత చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేకం. ఆదివాసీ ఉద్యమంలో డ్రోన్ ఉపయోగించడం తప్పని చెప్పి సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లను పోలీసులు  వేధించడాని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ అరకు ఉత్సవం, మొదకొండమ్మ ఉత్సవం, యోగా దినోత్సవం వంటి ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం కోసం ఆదివాసీ కంటెంట్ క్రియేటర్లను **ఉచితంగా వెట్టిచాకిరీ** చేయించుకున్నారు. నాడు లేని అనుమతి నేడు ఆదివాసీ లాకు మద్దతుగా డ్రోన్ వినియించడని నేరమాని, అనుమతి లేదండం అనడం అన్యాయం. 1/70  చట్టం పరి రక్షణ కు సుప్రీం కోర్ట్ లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కౌంటర్ ఆపీడవిట్ దాఖాలు చేయండి. 1/70 చట్టాన్ని రద్దు చేయాలనీ 1672 నాన్ ట్రైబల్ సుప్రీం కోర్ట్ లో 2023లో పిటిషన్ దాఖాలు చేశారు. నాటి నుండి నేటి వరకు కూడ కనీసం గత ప్రభుత్వం గాని నేటి ప్రభుత్వం కానీ కౌంటర్ ఆపీడవిట్ దాఖాలు చేయక పోవడం తోనే ఆదివాసీ హక్కులు, చట్టాలు పరిరక్షణ కు ఎంత చిత్తశుద్ధి తో పని చేస్తున్నారో తెలుస్తుంది. ఇప్పటిదాకా ఐ టి డి ఏ ద్వారా ఎల్ టి ఆర్ కేసు కూడ నమోదు కూడ చేయడం లేదు.మరో పక్క కార్పొరేట్ కంపెనీ లు అటవీ సహజ వనరులు దోపిడీ కి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇటువంటి నేపథ్యంలో ఆదివాసీ ప్రజలకు తీవ్ర ప్రమాదం ఉన్న పరిస్థితి లో 1/70  చట్టం రక్షణ ప్రధమ కర్తవ్యం మని అన్నారు. ప్రభుత్వం పిటిషన్ దాఖాలు చేయడం తన బాధ్యతని అన్నారు. ప్రభుత్వం దాఖాలు చేయకపోతే ఆదివాసీ సమాజం నుండి పిటిషన్ దాఖాలు చేస్తాం.ప్రభుత్వం తన రాజ్యాంగ బాధ్యతలను తక్షణం నిర్వర్తించి, ఆదివాసీ ప్రజల న్యాయమైన డిమాండ్లో రిజర్వేషన్,భూమి హక్కులు, అటవీ హక్కులు, స్వయం పాలనా హక్కులు — సత్వరం మరియు సమూలంగా** పరిష్కరించాలి. అణచివేత, బెదిరింపులు, తప్పుడు కేసులు మాని సమస్యల మూలాన్ని పరిష్కరించాలి. ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యతలు నిర్వర్తించాలని కోరుతున్నాం లేనట్లయితే రాజ్యాంగపరమైన మార్గాల్లో అన్ని చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేస్తున్నాం.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...