Connect with us

Hi, what are you looking for?

Visakhapatnam

రౌడీ షీటర్లు బాధ్యతాయుతమైన పౌరులుగా మెలగాలి

రౌడీ షీటర్లకు ఎం ఆర్ పేట సీఐ హెచ్చరిక..

విశాఖపట్నం (స్వతంత్ర ప్రభ)

ప్రజల శాంతి, భద్రత పరి రక్షణే పోలీసు శాఖ ప్రధాన లక్ష్యమని మహారాణిపేట పోలీస్ స్టేషన్ సీఐ గోవింద రావు పేర్కొన్నారు ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో నిర్వహించిన అవగాహన సమావేశంలో స్టేషన్ పరిధిలోని రౌడీ షీటర్లతో సమావేశమై పలు సూచనలు హెచ్చరికలు జారీ చేశారు సీఐ మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ సంఘ విద్రోహ చర్యలు శాంతి భద్రతలకు భంగం కలిగించే కార్యకలాపాలు, బెదిరింపులు దౌర్జన్యాలు,భూవివాదాలు లేదా ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ రాదని స్పష్టం చేశారు ప్రజల తో సత్సంబంధాలు కొన సాగిస్తూ చట్టాన్ని గౌరవిస్తూ జీవించాలని సూచించారు అలాగే ఏవైనా వివాదాలు తలెత్తినప్పుడు వాటిని స్వయంగా పరిష్కరించు కునే ప్రయత్నం చేయకుండా సంబంధిత పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించాలని సూచించారు చట్టాన్ని అతి క్రమించే చర్యలకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు నేరాలకు దూరంగా ఉండి ఉపాధి, కుటుంబ బాధ్యతలపై దృష్టి సారించాలని సమాజంలో బాధ్యతాయుతమైన పౌరు లుగా మెలగాలని రౌడీ షీటర్లకు సీఐ సూచించారు పోలీసులు నిర్వహించే కౌన్సెలింగ్ అవగాహన కార్య క్రమాల ఉద్దేశం నేరాలను నిరోధించడం మరియు శాంతిభద్రతలను పరిరక్షిం చడమేనని ఆయన తెలిపారు సమావేశానికి హాజరైన రౌడీ షీటర్లు పోలీసుల సూచనలను పాటిస్తూ చట్టబద్ధంగా వ్యవహరిస్తామని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...