జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు
విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ )
దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు ఆధ్వర్యంలో దక్షిణ జోన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ప్రజల నుండి వివిధ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను నేరుగా స్వీకరించిన జోనల్ కమిషనర్, వాటిని సత్వరమే పరిశీలించి ప్రజలకు త్వరితగతిన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకుండా, ప్రతి ఫిర్యాదును నిర్దేశిత గడువులో పరిష్కరించి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మొత్తం 5 ఫిర్యాదులు స్వీకరించగా, వాటిలో టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన -2 ఫిర్యాదులు మరియు రెవెన్యూ -2, వాటర్ సప్లై సంబంధించిన 1 ఫిర్యాదులు ఉన్నాయి. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కృష్ణంరాజు, టౌన్ ప్లానింగ్, ఎలక్ట్రికల్, వాటర్ సప్లై విభాగాల అధికారులు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.,





