Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

ఆదివాసీ ఉద్యమకారాలపై కక్ష సాధింపు తగదు.

పాడేరు పోలీస్ స్టేషన్‌కు  జిఒ 3, 1/70 ఆందోళన నాయకుల హాజరు…!?

పాడేరు,(స్వతంత్ర ప్రభ)

జీవో నంబరు–3 రిజర్వేషన్ పునరుద్ధరణ, 1/70 భూబదలాయింపు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలనే డిమాండ్లతో శుక్రవారం పాడేరులో నిర్వహించిన గిరిజనుల ఆందోళన సందర్భంగా అభ్యతకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు నాయకులు సోమవారం విచారణ నిమిత్తం పాడేరు పోలీస్ స్టేషన్‌కు హాజరయ్యారు.ఐటీడీఏ కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో కొందరు వక్తలు కలెక్టరేట్‌ను బద్ధలు కొడతామని వ్యాఖ్యానించినట్లు పోలీసుల దృష్టికి వచ్చిన నేపథ్యంలో కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.ఈ క్రమంలో నోటీసులు అందుకున్న కొందరు ఆందోళనాకారులు సోమవారం పాడేరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసుల ఎదుట హాజరుకావడం జరిగింది. వారి నుంచి వివరణలు నమోదు చేసి, సభలో చేసిన ప్రసంగాల వీడియోలు, ఇతర ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం. విచారణ పూర్తైన అనంతరం తదుపరి చర్యలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విచారణకు హాజరైన వారిలో పి.అప్పలనర్స, కూడా రాధాకృష్ణ, కర్జ వైకుమార్, కొర్ర కార్తిక్, వంతల దాస్, కొంట సుధీర్ కుమార్, లోకేష్, కొర్ర రాజశేఖర్ ఉన్నారు.ఈ సందర్బంగా పి. అప్పల నరస మాట్లాడుతూ పోలీస్ విచారణ కు సంపూర్ణం గా సహకారం అందిస్తామని, ప్రభుత్వం ఆస్తులు ధ్వసం చేసే ఉద్యమ విధానం మాది కాదని, అభ్యతకర వాక్యాలపై విచారం వ్యక్తం చేస్తున్నాను.  ఆదివాసీ ఉద్యమకారులపై ప్రభుత్వం కక్ష సాధింపు తగదన్నారు. ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై న్యాయస్థానం నీ ఆశ్రయిస్తాం అని అన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...