విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)
విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సమక్షంలో చెంగల రావు పేట ,శ్రీ శ్రీ శ్రీ కోదండ సీతారామాలయం నూతన ధర్మకర్తల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం, అలాగే ఏవిఎన్ కళాశాల,మెయిన్ రోడ్ శ్రీ శ్రీ విఘ్నేశ్వరాలయం నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన ఈ కార్యక్రమంలో నూతన ధర్మకర్తలు బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ,”దేవుని సన్నిధిలో సేవ చేసే అవకాశం లభించడం ఎంతో గొప్ప వరం. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలే కాకుండా సమాజానికి సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు. ప్రతి ఒక్కరూ సేవాభావంతో ఆలయ అభివృద్ధికి కృషి చేసి భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కట్టుబడి ఉండాలి” అని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఆలయ ఈవోలు, ధర్మకర్తల కమిటీ సభ్యులు, ఆలయ పెద్దలు, కుటుంబ సభ్యులు, బంధువులు, కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు భక్తులు పాల్గొన్నారు.





