Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయంలో “స్పార్క్ 3.0” పారిశ్రామిక అన్వేషణ బూట్‌క్యాంప్ ప్రారంభం

తాడేపల్లిగూడెం, ( స్వతంత్ర ప్రభ )

డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం మరియు రాజమహేంద్రవరంలోని రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్  సంయుక్త ఆధ్వర్యంలో యువ వ్యవసాయ ఆవిష్కర్తల్లో పారిశ్రామిక నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ఐదు రోజుల “స్పార్క్ 3.0 – ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎక్స్‌ప్లోరేషన్ బూట్‌క్యాంప్” నేడు ఘనంగా ప్రారంభమైంది. జూలై 21 నుండి 25, 2026 వరకు నిర్వహించబడనున్న ఈ శిక్షణా కార్యక్రమం వేంకటరామన్నగూడెంలోని డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉద్యాన కళాశాల ప్రాంగణంలోని హార్టీ-బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్ లో జరుగుతోంది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డా. వై.ఎస్.ఆర్. ఉద్యాన విశ్వవిద్యాలయం ఉపకులపతి డా. కె. ధనుంజయరావు మాట్లాడుతూ, భారతదేశంలో ఆధునిక ఆవిష్కరణలు, పారిశ్రామిక అభివృద్ధికి విశేష సేవలందించిన రతన్ టాటా కృషిని స్మరించారు. గతంలో వివిధ విశ్వవిద్యాలయాల మధ్య ఏర్పడిన ఫలవంతమైన భాగస్వామ్యాలను ప్రస్తావిస్తూ, ఈ బూట్‌క్యాంప్ ఆ అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని తెలిపారు. అలాగే గౌరవ ముఖ్యమంత్రి ఆకాంక్షించిన “ఒక కుటుంబం – ఒక పారిశ్రామికవేత్త” అనే లక్ష్య సాధనకుఈ కార్యక్రమం దోహదపడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉద్యాన కళాశాల డీన్ డా. బి. ప్రసన్న కుమార్, విద్యార్థి వ్యవహారాల డీన్ డా. సి. మధుమతి, పారిశ్రామిక మరియు అంతర్జాతీయ కార్యక్రమాల సంచాలకురాలు డా. టి. పద్మలత, ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్.బి.వి. చలపతిరావు, హెచ్‌బీఐసీ అధిపతి, విస్తరణ విద్య ప్రొఫెసర్ డా. ఈ. కరుణశ్రీ తదితరులు పాల్గొని ఉద్యాన రంగంలో పారిశ్రామిక అవకాశాలు, ఆవిష్కరణలు, స్టార్టప్‌ల ప్రాముఖ్యతపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ బూట్‌క్యాంప్‌కు ఎంపికైన విద్యార్థులు తమ ఆలోచనలు, లక్ష్యాలను పంచుకుంటూ, ఈ శిక్షణ తమలో పారిశ్రామిక దృక్పథాన్ని పెంపొందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇలాంటి విలువైన అవకాశాన్ని కల్పించిన విశ్వవిద్యాలయానికి వారు కృతజ్ఞతలు తెలిపారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...