తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ)
ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన భవనం నిర్మాణం కోసం శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ సొంత నిధులు రూ.10లక్షలుభారీ విరాళం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పి 4 విధానంలో నిర్మిస్తున్న ఈ జూనియర్ కళాశాలకు ఎమ్మెల్యేతో పాటు వాసవి ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం 10 లక్షలు ప్రకటించారు తొలి విడతగా రూ.5,00,000లు, ఇచ్చారు,చలంచర్ల మురళి 10 లక్షల రూపాయలు ప్రకటించారు తొలివిడతగా రూ.2,00,000లు విరాళం ఇచ్చారు, మంగళవారం ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో జూనియర్ కళాశాలకు ఎంతో కాలంగా సొంత భవనం లేక విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ సమస్యను తమ హయాంలో పరిష్కరించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎందరో ప్రముఖులు ముందుకు వచ్చి విరాళాలు అందజేయడం అభినందనీయమని అన్నారు. విద్య కోసం చేసే వ్యయం సమాజానికి ఎంతో మేలు చేస్తుందని అన్నారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో విద్యార్థులు విద్యతోపాటు క్రీడలలో కూడా రాణించాలనే ఉద్దేశంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నన్నయ విశ్వవిద్యాలయం వద్ద క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థి ఉన్నత విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యా మంత్రి లోకేష్ లు విద్యారంగంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టి, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన జరగాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.





