పాడేరు,(స్వతంత్ర ప్రభ)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయడానికి జిల్లా సమాచార & పౌరసంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఆటోరిక్షాలపై ప్రచార స్టిక్కర్లు అంటించే కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, ‘తల్లికి వందనం’ పథకం ద్వారా అర్హులైన విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తూ విద్యాభివృద్ధికి తోడ్పాటునందిస్తున్నదని తెలిపారు.ఈ పథకంపై ప్రతి కుటుంబానికి అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో జిల్లాలో తిరిగే ఆటోరిక్షాలపై ప్రచార స్టిక్కర్లు ఏర్పాటు చేసి విస్తృత ప్రచారం చేపట్టినట్లు పేర్కొన్నారు.





