Connect with us

Hi, what are you looking for?

AP NEWS

ఘనంగా జాప్ విశాఖ జిల్లా అధ్యక్షుడు ఎం.కీర్తన్ జన్మదిన వేడుకలు

విశాఖపట్నం, (స్వతంత్ర ప్రభ):

జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్) విశాఖ జిల్లా అధ్యక్షుడు, కోస్టల్ జర్నలిస్ట్ ఎడిటర్ ఎం. కీర్తన్ జన్మదిన వేడుకలు బుధవారం రామకృష్ణ బీచ్లో ఘనంగా నిర్వహించారు. జాప్ జిల్లా కార్యదర్శి జె.వి.కె. అప్పలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జాప్ సభ్యులు కేక్ కట్ చేసి కీర్తన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎం. కీర్తన్ మాట్లాడుతూ తన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని, వారికి ఎలాంటి సహాయం అవసరమైనా తాను అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.జాప్ జిల్లా కార్యదర్శి జె.వి.కె. అప్పలరాజు మాట్లాడుతూ ఎం. కీర్తన్ ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని, జర్నలిజం రంగంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పృథ్వీరాజు, వడ్డాది ఉదయ్ కుమార్, అర్జున్, సురేష్, సతీష్ తదితర జాప్ సభ్యులు పాల్గొని కీర్తన్కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...