Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

మరిడిమాంబ అన్న ప్రసాదానికి రూ.10వేలు వాసుపల్లి విరాళం

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)

దక్షిణ నియోజకవర్గం 31వ వార్డులో కొలువుదీరిన శ్రీ శ్రీ మరిడిమాంబ అమ్మవారి ఆలయ జాతర సందర్భంగా నిర్వహించనున్న అన్నదాన ప్రసాదానికి మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ.10వేలు విరాళం అందజేశారు. కనకల వీధి కి చెందిన ఈ ఆలయ కమిటీ సభ్యులకు 31 వైసీపీ అధ్యక్షుడు బాపు ఆనంద్ సమక్షంలో బుధవారం ఆసీలమెట్ల కార్యాలయంలో పదివేల రూపాయల నగదును వారికి అందజేశారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న లేకున్నా సేవా కార్యక్రమాలు చేసినందుకు తాను ఎప్పుడూ ముందుంటానన్నారు. ప్రతి ఏడాది నిర్వహించే ఈ మరిడి మాంబ అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరగాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు. అన్నదాన కార్యక్రమంలో ఎంతోమంది అమ్మవారి ప్రసాదంతో కడుపు నింపుకునేవారు వందలాదిమంది ఉంటారన్నారు. అటువంటి పేదలకు కూడా న్యాయం చేసే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలతోపాటు ఆంధ్ర రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. అమ్మవారి కరుణాకటాక్షం జగనన్న కుటుంబం పై చల్లగా ఉండాలని వాసుపల్లి గణేష్ కుమార్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పల్ల శ్రీను, పిలక మోహన్ ( డిస్ట్రిక్ట్ స్టూడెంట్ వింగ్ జనరల్ సెక్రటరీ ), దినేష్ ( వార్డ్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్స్ ),కమిటీ సభ్యులు అప్పారావు, నాయుడు, మహేష్ వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...