Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

35, 41వ వార్డులలో పర్యటించిన దక్షిణ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు

విశాఖ దక్షిణం, (స్వతంత్ర ప్రభ)

జీవీఎంసీ దక్షిణ జోన్ జోనల్ కమిషనర్ ఎం.మల్లయ్య నాయుడు 35వ వార్డు మరియు 41వ వార్డుల పరిధిలోని పూర్ణ మార్కెట్, జ్ఞానపురం, గెడ్డ వీధి, పోస్ట్ ఆఫీస్ రోడ్డు, స్టేషన్ మెయిన్ రోడ్డు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి పారిశుధ్య నిర్వహణను పరిశీలించారు.ఈ సందర్భంగా 35వ వార్డులో పారిశుధ్య కార్మికులతో ప్రత్యేక అవగాహన సమావేశాన్ని నిర్వహించి, ప్రతి పారిశుధ్య కార్మికుడు ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు విధులకు తప్పనిసరిగా హాజరు కావాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి సేకరించే చెత్తను తడి చెత్త, పొడి చెత్తగా వేరు చేసి సేకరించాలని, అలాగే ప్రతిరోజూ ఉదయం 7:00 గంటలలోపు ప్రధాన రహదారులన్నింటినీ పూర్తిగా శుభ్రపరచాలని ఆదేశించారు. రోడ్లపై ఎక్కడా చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు తొలగిస్తూ నగర పరిశుభ్రతను కాపాడాలని పారిశుధ్య కార్మికులకు సూచించారు.అనంతరం 41వ వార్డులోని జ్ఞానపురం, గెడ్డ వీధి, పోస్ట్ ఆఫీస్ రోడ్డు ప్రాంతాల్లో పర్యటించి, ప్రజలు కాలువల్లో చెత్త వేయకుండా ఇంటి వద్దకు వచ్చే చెత్త సేకరణ వాహనానికే చెత్తను అందించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే స్టేషన్ మెయిన్ రోడ్డు పరిధిలోని వాణిజ్య సముదాయాలు, టిఫిన్ సెంటర్లు మరియు ఇతర వ్యాపార సంస్థలు ప్లాస్టిక్ కవర్ల వినియోగాన్ని పూర్తిగా నివారించి, పర్యావరణహిత ప్రత్యామ్నాయ కవర్లను ఉపయోగించాలని సూచించారు.రైల్వే స్టేషన్ మెయిన్ రోడ్డును ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ప్రధాన రహదారులపై పారిశుధ్య కార్మికులను సమర్థవంతంగా వినియోగించి నిరంతర పరిశుభ్రతను నిర్వహించాలని సంబంధిత శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ డా. కృష్ణంరాజు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విజయ్ కుమార్, శానిటరీ సూపర్‌వైజర్ నీలిమ, 41వ వార్డు శానిటరీ ఇన్‌స్పెక్టర్, శానిటరీ సెక్రటరీలు, మేస్త్రీలు, సూపర్‌వైజర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...