Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

రాష్ట్ర స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘జనవాణి’ : ఎమ్మెల్యే బొలిశెట్టి

తాడేపల్లిగూడెం, (స్వతంత్ర ప్రభ.)

రాష్ట్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల సత్వర పరిష్కారానికి మంగళగిరిలో జనసేన ప్రధాన కార్యాలయంలో ప్రతిరోజు ‘జనవాణి’ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శాసనసభ్యులు,రాష్ట్ర ప్రభుత్వ విప్ బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో బుధవారం ‘జనవాణి’  కార్యక్రమంలోఎమ్మెల్యే పాల్గొన్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం  నిరంతర ప్రక్రియగా జనసేన ప్రధాన కార్యాలయంలో ‘జనవాణి’ కార్యక్రమాన్ని జనసేన అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ రూపొందించారని అన్నారు. రాజకీయమంటే కేవలం అధికారం కోసం మాత్రమే కాకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి వారి సమస్యలకు పరిష్కారానికి కృషి చేయాలనే పవన్ ఆశయాలను నెరవేర్చే దిశగా  పనిచేస్తున్నామన్నారు. ప్రతి సోమవారం గ్రామాలలో పట్టణాలలో నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పి.జి.ఆర్. ఎస్.)లలో పరిష్కారం కాని  సమస్యలను జనవాణిలో పరిష్కరించే విధంగా కృషి  చేస్తున్నామన్నారు. గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలో కనీస మౌలిక సదుపాయాలను కల్పించడంలో విఫలమైందని విమర్శించారు. రోడ్లు,డ్రైనేజీల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సరఫరా,పారిశుధ్య నిర్వహణ,ప్రజారోగ్య పరిరక్షణ,పర్యావరణ పరిరక్షణ తదితర ముఖ్యమైన బాధ్యతలను నెరవేర్చకుండా వైసిపి అరాచక పాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారని ఆరోపించారు. రైతులు, ఎస్సీ ఎస్టీ, బీసీ తదితర వెనుకబడిన వర్గాల ప్రజలు, విద్యార్థులు, మహిళలు ఎన్నో అవస్థల పాలయ్యారన్నారు.గత ప్రభుత్వ అసమర్ధ నిర్వాకాలవల్ల రాష్ట్రంలో ప్రజా సమస్యలు కొండల్లా పేరుకుపోయాయని అన్నారు. కూటమి ప్రభుత్వం పాలన చేపట్టిన వెంటనే ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పి.జి.ఆర్.ఎస్. )ల ద్వారా పెద్ద ఎత్తున ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని తెలిపారు.  దీర్ఘ కాలంగా సమస్యలు పరిష్కారం కాకుండా సతమతమయ్యే ప్రజలకు సత్వరమే ఉపశమనం కలిగించి, సమగ్ర పరిష్కారం చూపించాలనే బృహత్తర లక్ష్యంతో జనసేన కార్యాలయంలో నిరంతర ప్రక్రియగా జనవాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ముఖ్య నేతలందరూ దశల వారీగా ఈ జనవాణిలో పాల్గొని నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని, ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...