విశాఖ తూర్పు, (స్వతంత్ర ప్రభ)
తల్లి మందలించిందనే మనస్తాపంతో ఇంటి నుంచి వెళ్లిపోయిన యువతి అదృశ్యమైన ఘటనను త్రీటౌన్ పోలీసులు అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆమె ఆచూకీని విజయవంతంగా గుర్తించారు.త్రీటౌన్ పోలీస్ స్టేషన్ సీఐ అప్పలనాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం వేగంగా దర్యాప్తు చేపట్టి, బుధవారం యువతిని సురక్షితంగా గుర్తించింది. అనంతరం ఆమెకు కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించారు.పోలీసుల సత్వర స్పందన, సమర్థవంతమైన దర్యాప్తుతో ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా పోలీసుల సేవలను కుటుంబ సభ్యులు అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.





