Connect with us

Hi, what are you looking for?

Andhrapradesh

సోంపేటలో బీసీ సంక్షేమ సంఘం సమావేశం – కమిటీలు ఏర్పాటు

.జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్, సంఘ సేవకురాలు డాక్టర్ సిపాన గుణవతి

సోంపేట,(స్వతంత్ర ప్రభ)

రాజకీయాలకు అతీతంగా ప్రజా సంక్షేమం, నిస్వార్థ సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరూ ప్రజాసేవలో భాగస్వాములు కావాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ఇన్‌చార్జ్, సంఘ సేవకురాలు డాక్టర్ సిపాన గుణవతి పిలుపునిచ్చారు. గురువారం సోంపేటలో నిర్వహించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం విస్తృత సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారం, వెనుకబడిన వర్గాల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందని తెలిపారు. ప్రజా సేవ చేయాలనే సంకల్పం ఉన్న ప్రతి ఒక్కరికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం వేదికగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు.ఈ సమావేశంలో మందస కార్గో ఎయిర్‌పోర్టు, సోంపేట రైతు బజార్, శారదాపురం కోతుల వీరవిహారం, ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యలు తదితర ప్రజా సమస్యలపై సుదీర్ఘంగా చర్చించి, వాటి పరిష్కారానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. సమావేశంలో జిల్లా క్రమశిక్షణ స్టాండింగ్ కమిటీ అధ్యక్షుడు లోకినిది గోవిందరాజులు, జిల్లా అధ్యక్షుడు పిట్ట పోలయ్య, జిల్లా ఉపాధ్యక్షుడు రవికుమార్, పలాస సబ్ డివిజనల్ అధ్యక్షుడు మడ్డు సోమశేఖర్, పలాస సబ్ డివిజనల్ ఉపాధ్యక్షుడు బంగారు విశ్వనాథం, సోంపేట మండల కన్వీనర్ కడియం ప్రసాద్, సునీల్, రాజేష్ తదితరులు పాల్గొని పలు అంశాలపై విస్తృతంగా చర్చించారు.అనంతరం సంఘ బలోపేతంలో భాగంగా నూతన కమిటీని ప్రకటించారు. శ్రీకాకుళం జిల్లా గౌరవ అధ్యక్షుడిగా డాక్టర్ ఉలాల కోదండరాం, జిల్లా అడ్వైజర్‌గా దాసరి షణ్ముఖరావు, శ్రీకాకుళం సబ్ డివిజనల్ లీగల్ అడ్వైజర్‌గా కారి అప్పారావు, పలాస సబ్ డివిజనల్ అధ్యక్షుడిగా మడ్డు సోమశేఖర్, పలాస సబ్ డివిజనల్ ప్రధాన కార్యదర్శిగా కాలువ వాసుదేవ్, పలాస సబ్ డివిజనల్ వైస్ కన్వీనర్‌గా బంగారు విశ్వనాథం, పలాస సబ్ డివిజనల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉగ్గుపిల్లి తిరుపతిరావు, కంచిలి మండల కన్వీనర్‌గా పిట్ట భారతి, కంచిలి మండల ప్రధాన కార్యదర్శిగా పిట్ట శంకర్రావు, సోంపేట మండల కన్వీనర్‌గా కడియం ప్రసాద్, సోంపేట మండల మహిళా కన్వీనర్‌గా మద్దెల వేణు, సోంపేట మండల ప్రధాన కార్యదర్శిగా గజ్జల తులసీదాస్, కవిటి మండల కన్వీనర్‌గా బల్ల తిరుపతి, కవిటి మండల ప్రధాన కార్యదర్శిగా గంటి శ్రీనివాసరావు, గొల్లవూరు పంచాయతీ కన్వీనర్‌గా సామంత్ చిరంజీవి రెడ్డి, జగతి పంచాయతీ కన్వీనర్‌గా నాగుపిల్లి పురుషోత్తం, తాళభద్ర పంచాయతీ కన్వీనర్‌గా కరగాన హరికృష్ణ, తాళభద్ర పంచాయతీ ప్రధాన కార్యదర్శిగా నెయ్యిల జోగారామయ్య, మామిడిపల్లి పంచాయతీ కన్వీనర్‌గా పాటిన మనోజ్ కుమార్లను నియమించినట్లు ప్రకటించారు.నూతనంగా బాధ్యతలు చేపట్టిన నాయకులకు సమావేశంలో అభినందనలు తెలియజేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారం, బీసీ వర్గాల హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం సాధన కోసం సమిష్టిగా పనిచేయాలని డాక్టర్  గుణవతి పిలుపునిచ్చారు. సమావేశం అనంతరం నూతన కమిటీ సభ్యులు సంఘ ఆశయాలను గ్రామస్థాయికి తీసుకెళ్లి తమ వంతు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

Click to comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You May Also Like

AP NEWS

తెలంగాణలో పార్టీ బలోపేతానికి జనసేన వేగంగా అడుగులు వేస్తోందని,ప్రజా సమస్యలపై నిరంతర పోరాటంతో పాటు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. పోరాటాల గడ్డగా పేరొందిన...

AP NEWS

ఫుడ్ స్ట్రీట్‌లో ప్రజల మధ్య అల్పాహారం స్వీకరించిన కేంద్ర సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తాడేపల్లిగూడెం, జూలై:16(స్వతంత్ర ప్రభ) త్వరలో భీమవరం పాలకొల్లులలో ఈట్ స్ట్రీట్ లను ఏర్పాటు చేయటానికి కృషి చేస్తాను...

BJP

విశాఖపట్నం, జూలై 17 (స్వతంత్ర ప్రభ): మహారాణిపేట పోలీస్ స్టేషన్ నూతన సర్కిల్ ఇన్‌స్పెక్టర్ (సీఐ)గా బాధ్యతలు చేపట్టిన జి. గోవిందరావును శుక్రవారం బీజేపీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు...

AP NEWS

కౌన్సిలింగ్‌తో మనోధైర్యం నింపిన పోలీసులు విశాఖ దక్షిణం,(స్వతంత్ర ప్రభ) ఆర్థిక ఇబ్బందులు, నిరుద్యోగ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించబోయిన ఓ యువకుడిని వన్‌టౌన్ పోలీసులు సకాలంలో స్పందించి కాపాడారు. వన్‌టౌన్...